fruit mixing
-
ఉత్సాహంగా ఫ్రూట్ మిక్సింగ్
వివిధ రకాల పళ్లను ప్రత్యేక రీతిలో మిక్స్ చేసి నగర యువత సందడి చేసింది. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్లో ఆదివారం ఫ్రూట్ మిక్సింగ్ జరిగింది. క్రిస్మస్ను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేక్ మిక్సింగ్‌లా ఫ్రూట్ మిక్సింగ్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రకాల పళ్లను ఒక పెద్ద పాత్రలో ఉంచి తేనె, వైన్, రమ్, విస్కీ, నిమ్మ జోడించి మిక్సింగ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ఆటలలో చిన్నారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నోవాటెల్ జీఎం నీల్ పాటర్సన్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ ముత్తుకుమార్లు పాల్గొన్నారు. - మాదాపూర్ -
ఫన్టాస్టిక్ ఫ్రూట్ మిక్సింగ్...
రెండు నెలల తర్వాత రానున్న క్రిస్మస్ కోసం అప్పుడే సన్నాహాలు మొదలయ్యూరుు. నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ-క్రిస్మస్ సన్నాహాల్లో భాగంగా ఫ్రూట్ మిక్సింగ్ వేడుక ఉత్సాహభరితంగా జరిగింది. హోటల్ సిబ్బంది అతిథులు ఒక్కొక్కరినే మిక్సింగ్ టేబుల్ వద్దకు తోడ్కొని వచ్చారు. అతిథులు డ్రైఫ్రూట్స్ గుప్పిళ్లు గుప్పిళ్లుగా చేతుల్లోకి తీసుకుని, మిక్సింగ్ పాత్రలో వేశారు. దాదాపు 150 కిలోల డ్రైఫ్రూట్స్‌ను మిక్స్ చేశారు. మిక్సింగ్ పూర్తయ్యూక వాటిపై సీసాల కొద్ది వైన్ పోశారు. మిక్స్‌చేసి, వైన్‌లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ క్రిస్మస్ నాటికి కేకులు, ఫుడ్డింగ్ల తయూరీకి ఉపయోగపడేలా సిద్ధవువుతాయుని నోవాటెల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ చెప్పారు.ప్రత్యేక ఆకర్షణగా ప్రణీత నిలిచింది.