విశాఖపట్నం: విశాఖపట్నం నగరంలో ఈ నెల 8వ తేదీ నుంచి కామన్వెల్త్ పార్లమెంట్ కమిటీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. స్థానిక నోవాటెల్ హోటల్లో ఈ సమావేశాలు ప్రారంభవుతాయి. 8, 9వ తేదీలు విశాఖలోనే ఈ సమావేశాలు జరుగుతాయి. అయితే ఈ ముగింపు సమావేశాలు మాత్రం అరకులో జరగనున్నాయి. ఈ సమావేశాలను లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రారంభిస్తారు. ఈ సమావేశాలకు కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రతినిధులతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల స్పీకర్లు హాజరుకానున్నారు.