
అటు విలాసం.. ఇటు చిద్విలాసం..
ఖరీదైన దుస్తులు-ఉత్పత్తులు జిగేల్మన్న చోటే.. అందగత్తెల చిరునవ్వులు తళుక్కుమన్నాయి. విలాస-చిద్విలాసాల నడుమ మాదాపూర్ నొవోటెల్ హోటల్‌లో గురువారం హై-లైఫ్ ఎగ్జిబిషన్ సందడిగా ప్రారంభమైంది. లగ్జరీ ఉత్పత్తులకు పేరొందిన ఈ ఎక్స్‌పో ప్రారంభానికి నటి మధురిమ, మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్ ప్లానెట్ అను బస్రీలు అందాల అతిథులుగా హాజరయ్యారు.
చెన్నై, అహ్మదాబాద్, ముంబయి, బెంగళూరు, కొచ్చిన్, పూనె వంటి నగరాల నుంచి వచ్చిన డిజైనర్ ఉత్పత్తులతో పాటు శ్రీలంక తదితర విదేశీ వస్తువులు సైతం ఈ ఎక్స్‌పోలో కొలువుదీరాయి. దుస్తులు, ఇంటి అలంకరణ వస్తువులు, ఆర్ట్ పీసెస్.. ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రదర్శన 3 రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
- సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి