Food Festival
-
టేస్టీ.. నార్త్ఫుడ్..
ఓ వైపు మాన్సూన్ ముసుర్లతో నగరం తడిసి ముద్దవుతుంటే.. మరోవైపు నార్త్ ఇండియన్ ఫుడ్ఫెస్ట్లో స్పెషల్ డిషెస్ నగరవాసుల జిహ్వకు కొత్త రుచిని పరిచయం చేస్తున్నాయి. ఆనాటి నుంచి దక్కన్ నేల అంటేనే పసందైన రుచులు, మసాల వంటకాలకు నిలయం. అయినప్పటికీ కొత్త రుచులను ఆహ్వానించడంలో, ఆస్వాదించడంలో హైదరాబాద్ ఎల్లప్పుడూ ముందుంటుంది. దీనికి తగ్గట్టుగానే విభిన్న సంస్కృతులకు నిలయమైన నగరంలో దేశీయ వంటకాలతో పాటు కాంటినెంటల్ రెసిపీలకూ పెట్టింది పేరు. ఈ ఆనవాయితిలో భాగంగానే కొంగొత్త రుచులను ఇష్టపడే భాగ్యనగరంలో ఉత్తరాది వంటకాల ఘుమఘుమలు వెదజల్లుతున్నాయి. జూబ్లిహిల్స్‌లోని ఆలివ్ బిస్ట్రో అండ్ బార్ వేదికగా ప్రారంభమైన ఈ నార్త్ ఫుడ్ ఫెస్ట్ ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. ఢిల్లీకి చెందిన ప్రఖ్యాత చెఫ్ ధృవ్ ఒబెరాయ్, అవార్డ్ విన్నింగ్ మిక్సాలజిస్ట్ హరీష్ చిమ్వాల్ ఆధ్వర్యంలోని ఈ ప్రత్యేకమైన డైనింగ్ ఫుడ్ లవర్స్‌కు డెస్టినేషన్‌గా మారింది. స్పైసీ, మసాలాలు, బిర్యానీలు ఆస్వాదించే హైదరాబాద్‌లో పుల్లటి ఉసిరి, కచ్చ మామిడి సలాడ్ మొదలు హిమాలయన్ చీజ్ సౌఫిల్ వరకు వినూత్న రుచులు సందడి చేస్తున్నాయి. చెఫ్ ధ్రువ్ పాకశాస్త్ర నైపుణ్యంతో తయారు చేసిన జామూన్ ఊరగాయ, పొగబెట్టి వడ్డించిన వంకాయ లాబ్నేతో పాటు సిరోహి మటన్, క్వాయిల్ ఎగ్ కుఫ్తే మీట్‌బాల్స్ వంటి నోరూరించే వంటకాలు నగరానికి సరికొత్త ఆకలిని సృష్టిస్తున్నాయి. ఆహ్లాదమైన దుర్గం చెరువు అంచున బటర్నట్ స్క్వా–హరిస్సా, తాహినీ–సీబాస్, కటిల్ ఫిష్–పిసి వంటి ఆధునికత మిళితం చేసిన క్లాసిక్ వంటకాలు మరో లోకాన్ని పరిచయం చేస్తున్నాయి. వీటికి అద్భుత సమ్మేళనంలా హరీష్ చిమ్వాల్ అందిస్తున్న కాక్టెయిల్ మిక్సింగ్ మరో స్పెషాలిటి. ఎథీనా, హైబిస్కస్, రోసా టెక్, మొరాకన్ సోర్, కోకో బౌలేవార్డియర్ వంటి మిక్స్‌లు వెస్ట్రన్ బార్లను తలపిస్తున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ పాప్–అప్.. కొత్త రుచులను ఆస్వాదించడానికి నగరవాసులు విదేశాలకు లేదా ఉత్తరాది నగరాలకు వెళ్లాల్సిన శ్రమ లేకుండా.. ఆ రుచులే నగరానికి వచ్చాయి. ఈ హైదరాబాద్, ఢిల్లీ పాప్–అప్ మునుపెన్నడూ చూడని మంచి అనుభూతిని అందిస్తుంది. ఉత్తరాది వారు నగరంలో ఎంతో మంది ఉన్నారు. నార్త్ వంటకాలను ఇష్టపడే నగరవాసులు కూడా ఉన్నారు. – విజయ్ డేవిడ్ నిరంజన్, చెఫ్–ఆలివ్ బిస్ట్రో హైదరాబాద్.కొత్త రుచులే.. నా హాబీ.. మన సిటీలో నార్త్ డిషెస్ తినడం గొప్ప అనుభూతి. సాధారణంగా కొత్త కొత్త రుచుల కోసం విభిన్న ప్రాంతాలకు వెళ్తుంటాను. నా హాబీలో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల వంటకాలను రుచి చూశాను. ఐతే.. నార్త్ వంటకాలకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. స్థానిక వంటకాలతో పాటు వాటికి మోడ్రన్ హంగులను అద్దుతారు. ఈ ఫెస్ట్‌లో హిమాలయన్ చీజ్ జామూన్ భలే రుచిగా ఉంది. ఈ కొండ పైనుంచి దుర్గం చెరువు అందాలను తిలకిస్తూ తినడం మరచిపోలేని అనుభూతి. – కృతిక సనైన, జూబ్లిహిల్స్వావ్ హైదరాబాద్..హైదరాబాద్‌ను సందర్శించాలనే చికాల కోరిక ఈ విధంగా నెరవేరింది. నా దృష్టిలో సౌత్ఫుడ్ ఆరోగ్యకరమైంది.. నార్త్ ఫుడ్ రుచికరమైంది. ఈ ఫెస్ట్‌లో భాగంగా ఉత్తరాది రుచులను నగరవాసులు బాగా ఆస్వాదిస్తున్నారు. కాఫీ, రమ్‌లో నానబెట్టిన స్పాంజ్–మాస్కార్పోన్ ట్రిఫిల్ కొత్త అనుభూతినిస్తుంది. యువతరం టిరామిసు పిక్నిక్ బాస్కెట్లను ఇష్టంగా ఆరగిస్తున్నారు. దక్షిణాది ఆహారప్రియుడిగా నేను కూడా ఓల్డ్‌సిటీ రుచులకు ముగ్దుడినైపోయా.. షాగౌస్ బిర్యానీ రుచి వావ్ అనిపించింది. దేశంలోనే కాదు గ్లోబల్ వేదికగా కూడా ఈ నగరం ఫుడ్ ప్యారడైస్ అని చెప్పొచ్చు. ఇక్కడి సంస్కృతి, వ్యక్తిత్వాలు, ఆదరణ మరే నగరానికి సాటి రాదు. – ప్రఖ్యాత చెఫ్ ధృవ్ ఒబెరాయ్, ఆలివ్ బార్ అండ్ కిచెన్ న్యూఢిల్లీ -
జర్మనీలో మన రుచులు
నిర్మల్‌ఖిల్లా: జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో నిర్వహిహించిన ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్లో నిర్మల్‌కు చెందిన అజయ్‌కుమార్–శ్రీలత దంపతులు పాల్గొని ఇక్కడి తెలంగాణ సంప్రదాయ వంటకాలను పరిచయం చేశారు. అక్కడివారికి చికెన్ కర్రీ, బిర్యానీ, వడలు, సకినాలు, బూరెలు తదితర వంటకాల రుచి చూపించారు. జర్మనీ ప్రజలు డబల్ క మీఠా వంటకాన్ని ఇష్టంగా ఆరగించినట్లు వారు తెలిపారు. అక్కడి తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులతోపాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వారూ హాజరయ్యారు. నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన అజయ్‌కుమార్–శ్రీలత దంపతులు చేసిన వంటకాలకు అక్కడి నిర్వాహకులు, స్థానికుల ప్రశంసలు దక్కాయి. ఇలాంటి ఫెస్టివల్స్ జరగడం ఎంతో ఆనందంగా ఉందని, తెలుగు ప్రజలతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల వారంతా ఒక్కచోట కలుసుకుని మన దేశ వంటకాలను రుచి చూసే అవకాశం కల్పించడాన్ని పలువురు అభినందించారు. మన దేశ వంటకాల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉందని అజయ్‌కుమార్–శ్రీలత దంపతులు పేర్కొన్నారు. -
సేంద్రియ మత్స్య ఉత్పత్తులను ప్రోత్సహించాలి
సాక్షి, అమరావతి: సమాజంలో ప్రతి ఒక్కరు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మత్స్య ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని, ఎలాంటి రసాయన అవశేషాల్లేని సముద్ర మత్స్యఉత్పత్తులను కూడా సేంద్రియ ఉత్పత్తులుగానే పరిగణించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో భూమి ఆర్గానిక్స్ సహకారంతో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో మూడురోజులు నిర్వహించే 2వ దక్షిణ భారత స్థాయి సీఫుడ్ ఫెస్టివల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా 50 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో దేశంలోనే నంబర్–1 స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు వినియోగం ఎనిమిది కిలోలకు మించడం లేదన్నారు. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ఫిష్ ఆంధ్ర–ఫిట్ ఆంధ్ర బ్రాండింగ్‌తో హబ్స్ అండ్ స్పోక్స్ మోడల్లో పెద్ద ఎత్తున మార్కెటింగ్ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆక్వాహబ్, దానికి అనుబంధంగా రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 1,400 అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేశామని, మరో రెండువేల అవుట్‌లెట్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఔత్సాహికులు ముందుకొస్తే 40 నుంచి 60 శాతం సబ్సిడీపై యూనిట్లు మంజూరు చేయడమేగాక ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని రకాల చేయూత అందిస్తామని తెలిపారు. ఔత్సాహికులను ప్రోత్సహించడం, మాంసాహార ప్రియుల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సీఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే కాకినాడ, రాజమహేంద్రవరాల్లో నిర్వహించిన ఫెస్టివల్స్‌కు అనూహ్య స్పందన లభించిందన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న ఫెస్టివల్లో రూ.699కి అన్లిమిటెడ్ సీఫుడ్ బఫెట్ ఇస్తున్నట్లు చెప్పారు. త్వరలో విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు వంటి నగరాల్లో సీఫుడ్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఫిష్ ఆంధ్ర ఆన్లైన్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, ఏఎఫ్సీవోఎఫ్ చైర్మన్ కె.అనిల్‌బాబు, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, మత్స్యశాఖ అదనపు డైరెక్టర్ అంజలి, జేడీలు వి.వి.రావు, హీరానాయక్ పాల్గొన్నారు. -
విజయవాడలో సీ ఫుడ్ ఫెస్టివల్
సాక్షి, అమరావతి: స్థానిక వినియోగాన్ని పెంచడం, ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాల కల్పనే లక్ష్యంగా విజయవాడలో 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కూనపురెడ్డి కన్నబాబు తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటా 50 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో దేశంలోనే నం.1 స్థానంలో ఉన్న రాష్ట్రంలో స్థానిక వినియోగం 8 శాతానికి మించడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 75 శాతం మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. కానీ వినియోగం మాత్రం 5 శాతం లోపే ఉందని చెప్పారు. మిగిలిన రొయ్య అంతా ఎగుమతి అవుతోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఎదురైతే రాష్ట్రంలోని రొయ్య రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే డొమెస్టిక్ మార్కెట్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో సీ ఫుడ్ వినియోగదారులు పెద్ద ఎత్తున ఉన్నా.. డిమాండ్‌కు తగ్గట్టుగా రిటైల్ షాపులు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారిందన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ‘ఫిష్ ఆంధ్రా’ బ్రాండ్‌తో స్థానిక వినియోగం పెంచేలా ఆక్వా హబ్స్ అండ్ స్పోక్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 1,500 అవుట్ లెట్స్‌ను ఏర్పాటు చేయగా.. 15 హబ్స్ నిర్మాణంలో ఉన్నట్టు చెప్పారు. మరిన్ని హబ్స్, అవుట్ లెట్స్ ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించడం, వినియోగదారుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఫెస్టివల్లో 20 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఫెస్టివల్లో రోజూ రూ.699తో అపరిమితమైన సీ ఫుడ్ బఫెట్‌ను అందిస్తున్నామన్నారు. సీ ఫుడ్‌పై వంటల పోటీలు, వైద్యులు, పోషకాహార నిపుణులతో సెమినార్లు, 2కే రన్ నిర్వహంచనున్నట్టు తెలిపారు. ఇలాంటి సీ ఫుడ్ ఫెస్టివల్స్ విశాఖ, కాకినాడ, భీమవరం, నెల్లూరు తదితర ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోనూ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ బ్రోచర్‌ను కమిషనర్ కన్నబాబు విడుదల చేశారు. -
విజయవాడలో మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్
సాక్షి, అమరావతి: మత్స్య సంపద వినియోగాన్ని దేశీయంగా పెంచేందుకు, అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాలను విస్తృత పర్చాలనే లక్ష్యంతో విజయవాడలో మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ నెల 28 నుండి 30 వ తేదీ వరకు విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో భూమి ఆర్గానిక్స్ సౌజన్యంతో ప్రభుత్వం ఎంతో ఘనంగా ఈ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సాలీనా 50 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో రాష్ట్రం ఆక్వా హబ్ గా పేరుగాంచినప్పటికీ దేశీయ వినియోగం చాలా తక్కువగా ఉందన్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ మత్స్య సంపదను రాష్ట్రంలో సాలీనా ఒక వ్యక్తి కేవలం 8 కే.జి.లకు మించి వినియోగించుకోవడం లేదన్నారు. ఒకప్పుడు రొయ్యలను బ్రెజిల్ పూర్తిస్థాయిలో ఎగుమతి చేసేదని, అయితే డొమెస్టిక్ మార్కెట్ పెంచుకోవడం వల్ల స్థానికంగానే రొయ్యలను వినిగించుకునే స్థాయికి బ్రెజిల్ ఎదిగిందన్నారు. అదే స్థాయిలో మన రాష్ట్రం కూడా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 75 శాతం మేర రొయ్యలు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంటే, వాటి వినియోగం మాత్రం రాష్ట్రంలో కేవలం 5 శాతం లోపే ఉందన్నారు. మిగిలిన రొయ్య అంతా రాష్ట్రం నుండి ఎగుమతి అవుతున్నదని, అంతర్జాతీయ మార్కెట్ పై ఆధార పడి ఆ రొయ్యరేటు ఉంటుందని, అక్కడ ఏమన్నా తేడా వస్తే మన రైతులు నష్టాలకు గురి కావాల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితులను అదిగమించేందుకు డొమెస్టిక్ మార్కెట్ ను విస్తృత పర్చాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని మత్స్యకారులకు మరియు మత్స్య సంపదను సాగు చేసే రైతులకు మేలు చేసే విధంగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు పర్చాలని రెండేళ్ల క్రింద రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాను ప్రకారం తక్షణ చర్యగా ‘ఫిష్ ఆంధ్రా’ అనే ఒక బ్రాండ్‌ను గత ఏడాదిన్నర్ర కాలం నుండి విస్తృతంగా ప్రోత్సహించడం జరుగుచున్నదన్నారు. సీ ఫుడ్ వినియోగదారులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా రిటైల్ షాపులు అందుబాటులో లేకపోవడం కూడా ఒక సమస్యగా మారిందన్నారు. బహిరంగ మార్కెట్ లో చికెన్, మటన్, గుడ్లు విస్తృత స్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువ సమయం నిలువవుండని చేపలు, రొయ్యలు, పీతలు తదితర సీ ఫుడ్ ను అందుబాటులో ఉంచడమనేది సవాలుతో కూడుకున్న విషయమన్నారు. ఈ సమస్యను అదిగమించి తాజాగా గానీ, ప్యాక్డు రూపంలో గానీ సీ ఫుడ్ ను వినియోగదారులకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో హబ్ అండ్ స్పోక్ విధానాన్ని రాష్ట్రంలో అమలులోకి తేవడం జరిగిందన్నారు. ఇందులో బాగంగా సుమారు 1,500 అవుట్ లెట్స్ ను ఏర్పాటు చేయగా 26 హబ్స్ ను ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించడమైందన్నారు. మొత్తం 26 హబ్స్ లో 15 హబ్స్ నిర్మాణంలో ఉన్నాయని, మూడు ఆపరేషన్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అవసరం ఉన్న చోట మరిన్ని హబ్స్, అవుట్ లెట్స్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మరియు వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ ను వేదికగా చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సీ ఫుడ్ ఫెస్టివల్లో ఆక్వా రైతులు, మత్స్యకారులు, సీ ఫుడ్ ప్రాసెసింగ్, ప్రమోటింగ్ యూనిట్స్ ప్రతినిధులు మరియు సాదారణ పౌరులు మొత్తం దాదాపు 20 వేల మంది సందర్శకుల వరకూ పాల్గొనే అవకాశం ఉందన్నారు. మత్స శాఖ పరంగా పది స్టాళ్లను, నాలెడ్జు పార్టర్ అయిన భూమి ఆర్గానిక్స్ వారు కూడా పలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రూ.699/- లతో అపరిమితమైన సీ ఫుడ్ బఫెట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీ ఫుడ్ పై వంటల పోటీలు, వైద్యులు, పోషకాహార నిపుణులతో సెమినార్లు, 2K రన్ ను కూడా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ లో నిర్వహించడం జరుగుచున్నదని ఆయన తెలిపారు. విజయవాడతోనే ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ అగిపోదని, ఇటు వంటి సీ ఫుడ్ ఫెస్టివల్స్ విశాఖపట్నం, కాకినాడ, భీమవరం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదే విధంగా రానున్న రోజుల్లో జిల్లా కేంద్రాలతో పాటు హైద్రాబాదు, బెంగుళూరు వంటి నగరాల్లో కూడా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించనున్నామన్నారు. భూమి ఆర్గానిక్స్ ప్రతినిది రఘురామ్ మాట్లాడుతూ మానవునికి మంచి ఆరోగ్యాన్ని చేకూర్చే ఒమెగా 3 ఫాటియాసిడ్స్ చేపలో సమృద్దిగా ఉన్నాయని, ఇతర మాంసాహారాల కంటే చేపల వినియోగం ఎంతో మంచిదని అన్నారు. ఆరోగ్య కరమైన ఆహారాన్ని వినియోగదారులు పెద్దఎత్తున ఉపయోగించుకునేందుకు తమ సంస్థ పెద్ద ఎత్తున కృషిచేస్తున్నట్లు తెలిపారు. -
భువనగిరి : వారెవ్వా.. చేప రుచి చూడాల్సిందే..(ఫోటోలు)
-
నేటి నుంచి కృష్ణా తీరాన ఫుడ్ ఫెస్టివల్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నదీ తీరాన ప్రజలు చల్లని గాలులతో కూడిన ప్రదేశంలో సేద తీరేందుకు వీలుగా విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కృష్ణా నది ఒడ్డునున్న భవానీపురంలోని పున్నమి ఘాట్‌లో ఏప్రిల్ 29 నుంచి మే 7 వరకు ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది. ‘ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా’ థీమ్ తో తొలిసారిగా నదీ తీరాన ఈ ఫుడ్ ఫెస్టివల్ ను వీఎంసీ ఏర్పాటు చేసింది. స్కూళ్లకు వేసవి సెలవులు కావడంతో, పిల్లలు,పెద్దలు ఈ ప్రాంతంలో కనీసం 2 గంటల పాటు సేద తీరటంతోపాటు వారిని ఆహ్లాద పరిచే విధంగా ఈ ఫుడ్ ఫెస్టివల్ ఉండనుంది. ఇందులో ప్రసిద్ధిగాంచిన పంజాబీ, రాజస్థానీ, ఢిల్లీ, కేరళ, తందూరిలు, తెలుగు రాష్ట్రాల రుచికరమైన వంటకాలను 20కి పైగా స్టాల్స్‌లో తీసుకురాబోతున్నారు. విజయవాడకి సంబంధించి ప్రముఖ హోటళ్లు ఈ ఫుడ్ ఫెస్టివల్లో భాగస్వామ్యమవుతున్నాయి. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది. నదీ తీరాన ఈట్ స్ట్రీట్ తరహాలో దీన్ని అభివృద్ధి చేసేందుకు వీలుగా ఇక్కడ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ప్రజలకు రుచికరమైన ఆహారంతో పాటు లైవ్ రాక్ బ్యాండ్, డ్యాన్స్, జుంబా, గోడ, రోడ్డు పెయింటింగ్, శాండ్ ఆర్ట్, స్టాండ్–అప్ కామెడీ, వంటి ఈవెంట్స్‌తో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షో నటులతో కామెడీషో ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఫుడ్ ఫెస్టివల్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. -
అరచేతిలో హోటళ్లు..
భద్రాద్రి: జోరుగా వాన కురుస్తుంది.. బిర్యానీ తినాలనిపించింది..బయటకు వెళ్లాలంటే వర్షం.. ఎలా అనిఆలోచించాల్సిన పనిలేదిప్పుడు. చేతిలో సెల్‌ఫోన్ ఉండి అందులో ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటే చాలు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఫోన్ నుంచి ఆన్లైన్లో పేమెంట్ చేయవచ్చు. లేకుంటే ఆర్థర్ బాయ్‌కి డబ్బులు చెల్లించవచ్చు. అనుకోకుండా చుట్టాలో, స్నేహితులో ఇంటికి వచ్చారనుకొండి ఏ మాత్రం టెన్సన్ పడాల్సిన పనిలేదు. వారు ప్రెషప్ అయ్యే సరికి వేడివేడిగా వారికి మనం ఆర్డర్ చేసిన ఆహారం అందించవచ్చు. ఎండ, వాన, చలి ఏ సమయంలోనైనా ఫుడ్ డెలివరీ యాప్స్‌తో మనకు ఇష్టామైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని ఇంట్లోనే ఆస్వాదిస్తూ ఆరగించవచ్చు. గతంలో నగరాలు, పట్టణాలపై పరిమితమైన ఫుడ్ డెలివరీ యాప్స్ సేవలు ఇప్పుడు పట్టణాలకు సమీపంలోని గ్రామాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రమైన భద్రాచలంలోని హోటళ్లు, బేకరీల నుంచి ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్‌తో సారపాక, ఐటీసీ, తాళ్లగొమ్మూరు, కోయగూడెం, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం, బూర్గంపాడు ప్రాంతాలకు ఫుడ్ డెలివరీ అందుతుంది. ప్రస్తుతం భద్రాచలం, సారపాకలలోని హోటళ్లు, బేకరీల నుంచి పరిసర గ్రామాలకు స్విగ్గి, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్‌ల నుంచి సేవలు అందుతున్నాయి. బిర్యానీ, స్నాక్స్, చికెన్, మటన్, ఫిష్ తదితర మాంసాహార వంటకాలు ఆర్డర్ చేసిన అరగంటకే వేడివేడిగా అందుబాటులోకి వస్తున్నాయి.స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్ నుంచి స్విగ్గి, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలి. తొలిసారి యాప్‌లను వినియోగిస్తే ఫుడ్ బిల్లులో ఆఫర్లు కూడా వర్తిస్తాయి. అదేవిధంగా పండుగలకు, ఓపెనింగ్లకు కూడా కొన్ని హోటళ్లు ఆర్డర్లపై ఆఫర్లను ప్రకటిస్తాయి. ఫుడ్ డెలివరీ యాప్‌లతో సేవలందించేందుకు స్థానిక యువతకు కూడా ఉపాధి లభిస్తుంది. సొంత పనులు చేసుకుంటునే చాలామంది యువకులు పార్ట్‌టైమ్ జాబ్‌గా ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్న యువకులు, చదువుకుంటున్న యువకులు కూడా ఈ యాప్‌ల నుంచి సేవలను అందిస్తు ఉపాధిపొందుతున్నారు. పగటిపూట రోజువారీ పనులు చేసుకునే చాలామంది.. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఆర్డర్లను హోమ్ డెలివరీ చేస్తు ఉపాధి పొందుతున్నారు. ఫుడ్ డెలివరీ చేసే దూరం, ఫుడ్ పరిమాణాన్ని బట్టి బాయ్స్‌కు వేతనాన్ని అయా సంస్థలు అందిస్తాయి. ఫుడ్ డెలివరీ యాప్‌లతో అటు వినియోగదారులకు, ఇటు హోటళ్లు, బేకరీల నిర్వహకులకు కూడా సౌకర్యవంతంగా ఉంది. ఈ ఫుడ్ డెలివరీ సిస్టమ్‌తో స్థానికంగా చాలామంది యువతకు ఉపాధి లభిస్తుంది. కొన్నేళ్లుగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి నగరాలపై పరిమితమైన ఈ యాప్‌లు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించి సేవలను అందిస్తున్నాయి. ఫుడ్ ఆర్డర్‌తో ఈజీగా ఉంది మనకు కావాల్సింది తినాలనుకున్నప్పుడు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఫుడ్ ఆర్డర్ చేసుకోవటం ఈజీగా ఉంది. మనం ఆర్డర్ చేసిన అరగంట వ్యవధిలోనే ఫుడ్ ఇంటికి వస్తుంది. కొన్ని తప్పని పరిస్థితుల్లో మన ఆకలి తీర్చేందుకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయటం సులభమైంది. గ్రామీణ ప్రాంతాలలో కూడా స్విగ్గీ, జొమోటో వంటి సంస్థలు మనకు కావాలి్సన ఫుడ్‌ను ఇంటికే తీసుకువస్తున్నాయి. – వై శివారెడ్డి, రెడ్డిపాలెం బంధువులొస్తే భయం లేదు మనం పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్, బంధువులు ఇంటికి వస్తే వారికి అప్పటికప్పుడు వండి పెట్టలేము. వాళ్లు ఫ్రెష్ అయ్యేసరికి మనం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడితే అరగంటలోపే ఫుడ్ ఇంటికి వస్తుంది. స్విగ్గీ, జొమోటో వంటి సంస్థలు అన్నిరకాల ఫుడ్ ఐటెమ్స్‌ను మనం ఆర్డర్ చేసుకున్న దానిని బట్టి ఇంటికి పంపిస్తున్నారు. ఈ సేవలు చాలా బాగున్నాయి. – రాజశేఖర్, సారపాక -
Lunar Eclipse: ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి?
సాక్షి, భువనేశ్వర్: దేశవ్యాప్తంగా మంగళవారం చంద్రగ్రహణం కనువిందుచేసింది. ఇటానగర్, గుహవాటి, సిలిగురి ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించగా.. కోల్‌కతా, భువనేశ్వర్, ఢిల్లీ, శ్రీనగర్, చెన్నై, గాంధీ నగర్, ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది. కొందరు అనాదిగా వస్తున్న కొన్ని ఆచారాలను పాటించగా, మరికొందరు వాటిని లైట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశాలో రెండో చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాజధాని భువనేశ్వర్‌లోని లోహియా అకాడెమీలో హేతువాద వర్గం నేడు (చంద్రగ్రహణం) బిర్యానీ ఫెస్టివల్ నిర్వహించింది. విషయం తెలుసుకున్న సంప్రదాయవాదులు అక్కడకు చేరుకుని చంద్రగ్రహణం రోజున వండిపెట్టిన ఆహారాన్ని తినడమేంటని అభ్యంతరం తెలిపారు. పూర్వ కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని మంటగలుపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో బిర్యానీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నవారిపై సంప్రదాయవాదలు దాడికి పాల్పడ్డారు. హేతువాదులపై ఆవుపేడ, రాళ్లతో దాడి చేశారు. (చదవండి: Lunar Eclipse 2022: దేశవ్యాప్తంగా వీడిన చంద్రగ్రహణం) సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని లాఠీలకు పనిచెప్పారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బెర్హాంపూర్లోనూ ఇలాంటి వెలుగుచూసింది. బిర్యానీ ఫెస్టివల్ నిర్వహణను సంప్రదాయవాదులు అడ్డుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ధ్వంసం చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల రాకతో పరిస్థితి సద్దుమణిగింది. సంప్రదాయవాదులు అంటున్నట్టుగా నిల్వ ఉంచిన ఆహారాన్ని స్వీకరిస్తే చెడు ప్రభావాలేమీ ఉండవని హేతువాదులు చెప్తున్నారు. అర్థంలేని ఆచారాలను పాటించాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి సూర్యగ్రహణం రోజున కూడా భువనేశ్వర్‌లో సంప్రదాయవాదులు, హేతువాదుల మధ్య బిర్యానీ పంచాయితీ వివాదానికి దారితీసింది. (చదవండి: చంద్ర గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావమెంతంటే..) -
హైదరాబాద్‌లో టర్కీ ఫుడ్ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని హయత్ ప్లేస్ వేదికగా నేటి నుంచి జులై 3వ తేదీ వరకు ఫ్లేవర్స్ ఆఫ్ టర్కీ పేరుతో టర్కీష్ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమాన్ని బుధవారం హయత్ ప్లేస్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా టర్కీ కాన్సులేట్ జనరల్ ఒర్హాన్ ఎల్మాన్ ఒకన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరవాసుల కు తమ ఆహారం, సంస్కృతిని మరింత దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశామ ని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెన్‌లో టర్కిష్ ఫుడ్ వెరైటీస్ ఉంటాయని తెలిపారు. హైదరాబాదీ ఫుడ్‌కు, టర్కీ ఫుడ్‌కు సారూప్యత ఉంటుందన్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొనే వారు లక్కీ డ్రాలో భాగంగా టర్కీలో ఉచితంగా బస చేసే బహుమతిని పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: మంచు ఖండాన.. గ్రీన్ చాలెంజ్ జెండా) -
దుబాయ్ ఫుడ్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ స్టాల్
సాక్షి, అమరావతి: దుబాయ్‌లో జరుగుతున్న గల్ఫ్ ఫుడ్–2021 ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ ప్రోసెసింగ్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు జరిగే ఈ గల్ఫ్ ఫుడ్–2021 ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడారు. ఏపీలో ఫుడ్ ప్రోసెసింగ్ రంగంలో ఉన్న అవకాశాలు, పెట్టుబడులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఈ స్టాల్లో ఏపీలో ఉన్న వనరులు, పంట ఉత్పత్తుల వివరాలు, పెట్టుబడిదారులకున్న అవకాశాలను చెప్పారు. కార్యక్రమంలో ఏపీ ఫుడ్ ప్రోసెసింగ్ సీఈవో శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. చదవండి: పాస్‌పోర్ట్‌కూ ‘డిజి లాకర్’.. ఒరిజినల్ డాక్యుమెంట్లను వెంట తీసుకురానక్కర్లేదు తగ్గుతున్న నిరుద్యోగిత.. రికార్డుస్థాయిలో ఉద్యోగాలు -
ఎన్టీఆర్ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్
-
సీ ఫుడ్.. సో గుడ్
-
ఫుడ్ లవర్స్‌కు జియో బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై : టెలికాం సేవల్లో టాప్‌లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియో మరోసారి తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. దేశీయ అతిపెద్ద రెస్టారెంట్ టేబుల్ రిజర్వేషన్ సర్వీస్ సంస్థ డైన్అవుట్తో జియో జత కట్టింది. డైన్ అవుట్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ రెస్టారెంట్ ఫెస్టివల్‌కు రిలయన్స్ జియో డిజిటల్ భాగస్వామిగా మారి కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపును ఆఫర్ చేస్తోంది. నేడు (2019 ఆగస్ట్ 1) మొదలైన ఈ ఫెస్టివల్ 2019 సెప్టెంబర్ 1వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, పూణె, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, చండీగఢ్, గోవా, జైపూర్, లక్నో, ఇండోర్, సూరత్, కొచ్చి, లుధియానా, నాగ్‌పూర్ నగరాల్లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. డైన్అవుట్ ద్వారా టేబుల్ రిజర్వేషన్స్ చేసేవారికి సాధారణంగా బుకింగ్ ఫీజు వసూలు చేస్తుంది. కానీ ఈ ప్లాట్‌ఫాంలో జియో యూజర్లు చేసుకునే మొదటి బుకింగ్‌పై రూ.100 తగ్గింపు లభిస్తుంది. ఇది జియో వినియోగదారులకు మాత్రమే ప్రత్యేకంగా. అలాగే బిల్లుపై పత్ర్యేక డిస్కౌంట్‌ను కూడా అందిస్తుంది. దీంతోపాటు ఫుడ్, డ్రింక్స్, బఫేపై 1+1 ఆఫర్స్ పొందొచ్చు. డైన్అవుట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న 17 పట్టణాల్లో, ఎనిమిదివేలకు పైగా రెస్టారెంట్లలో ఈ తగ్గింపు లభిస్తుంది. అలాగే టోటల్ ఫుడ్ బిల్, డ్రింక్స్ బిల్, బఫేపై 50శాతం తగ్గింపు ఆఫర్. ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం జియో యూజర్లకు మాత్రమే. మైజియో యాప్ ద్వారా జియో యూజర్లు కూపన్స్ సెక్షన్లో డిస్కౌంట్ కోడ్ పొంది, డైన్అవుట్ ప్లాట్ఫామ్లో కూపన్స్ రీడీమ్ చేసుకోవచ్చు. -
గార్లిక్ ఫెస్టివల్లో కాల్పులు, ముగ్గురు మృతి
న్యూయార్క్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియాలో ఓ ఫుడ్ ఫెస్టివల్ సాగుతుండగా అక్కడ గుమికూడిన వారిపై విరుచుకుపడిన ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. మూడు రోజుల గిల్రే గార్లిక్ ఫెస్టివల్ చివరి రోజున ఈ ఘటన జరిగింది. దుండగుడి కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనతో ఫుడ్ ఫెస్టివల్‌కు హాజరైన వారు భయంతో ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశారు. కాల్పుల శబ్ధాలతో ఉలిక్కిపడిన సందర్శకులు తొలుత బాణాసంచా పేలుళ్లుగా భావించామని ప్రత్యక్ష సాక్షుల్లో కొందరు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద సమ్మర్ ఫుడ్ ఫెస్టివల్‌గా పేరొందిన గిల్రే ఫుడ్ ఫెస్టివల్‌పై దాడి ఆందోళనకరమని అధికారులు పేర్కొన్నారు. -
జిహ్వా.. జితున్
-
రొజొ సందడి ప్రారంభం
భువనేశ్వర్ : రాష్ట్ర సంప్రదాయ పండగ రొజొ సందడి బుధ వారం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక పంథ్ నివాస్ సముదాయంలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అశోక్ చంద్ర పండా ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఆయనతో పాటు ఒడిశా పర్యాటక అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు, ప్రముఖ హాకీ క్రీడాకారుడు, మాజీ రాజ్య సభ సభ్యుడు దిలీప్ తిర్కి, స్థానిక ఎమ్మెల్యే ప్రియదర్శి మిశ్రా, నగర మేయరు అనంత నారాయణ జెనా, విభాగం కార్యదర్శి ఇతరేతర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రమంతటా ప్రదర్శన రాష్ట్రవ్యాప్తంగా పంథ్ నివాస్ ప్రాంగణాల్లో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అశోక్ చంద్ర పండా తెలిపారు. సంప్రదాయ పండగలో పిండి వంటలది పైచేయి. రొజొ సంబంధిత పిండి వంటలతో ఏర్పాటు చేసే ప్రదర్శనలో సందర్శకుల కోసం విక్రయ సదుపాయం కూడా కల్పించినట్లు మంత్రి వివరించారు. ఆటపాటల పండగ రొజొ ఆట పాటల పండగగా ఒడిశా పర్యాటక అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు దిలీప్ తిర్కి తెలిపారు. ప్రధానంగా కొత్త బట్టలు ధరించి బాలికలు, యువతులు ఊయల ఊగడం ఈ పండగ ప్రధాన సందడిగా పేర్కొన్నారు. రాష్ట్ర సంప్రదాయానికి ప్రతీకగా పర్యాటకులకు వసతి కల్పించే పంథ్ నివాస్ సముదాయాల్లో ఏటా ఈ ప్రదర్శన ఏర్పాటవుతుంది. పంథ్ నివాస్ ఆవరణలో ఊయలలు ఏర్పాటు చేయడంతో వచ్చి పోయే యువతులు, బాలికలు సరదాగా ఆటపాటలతో గడిపి సంతోషంగా తిరిగి వెళ్తారు. రాష్ట్రానికి విచ్చేసి పంథ్ నివాస్‌లో బస చేసిన రాష్ట్రేతర పర్యాటకుల దృష్టిని ఈ ఆచార, సంప్రదాయం ఆకట్టుకుంటుంది. పర్యాటకులు రాష్ట్ర వంటకాల రుచి చూపేందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందని నగర మేయరు అనంత నారాయణ జెనా తెలిపారు. నోరూరించే ప్రదర్శన రొజొను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రదర్శన 4 రోజులపాటు కొనసాగుతుంది. ఈ ప్రదర్శనలో పలు రుచికర పిండి వంటకాల్ని ప్రదర్శిస్తున్నారు. అరిసెలు, కకరాలు, అట్లు, మొండా, పొడొ పిఠా, ఖిరొ గొజ్జా ఇతరేతర పిండి వంటకాలు, మిఠాయిలతో కిళ్లీలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. రొజొ పండగ సందడిలో కిళ్లీ అగ్ర స్థానంలో నిలుస్తుంది. -
వినండి.. తినండి
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : మండే ఎండాకాలంలో సాగరతీరంఓ అద్భుత ప్రాంతం. చల్లని గాలులతో సేద తీరేందుకు చక్కటి విడిది. అందమైన తీరం..మరో వైపు హోరెత్తించే పాటలు ఇలాంటి వాతావరణంలో సిటిజనులు గంటల తరబడి ఉండిపోతారు. మరి ఇలాంటి సమయంలో నచ్చిన ఫుడ్ ఉంటే వావ్.. భలే ఉంటుంది కదూ. ఇటువంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం సహకారంతో ఫుడ్ మానియా ఫెస్ట్ ఆర్కే బీచ్‌లో నిర్వహిస్తున్నారు. ఫుడ్‌తో పాటు ఆహ్లాదకరమైన మ్యూజిక్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లకు నగరవాసులు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు వినోద్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించడం జరగుతుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఫుడ్ ఐటమ్స్ నగర వాసులకు అందుబాటులో ఉంచామన్నారు. ఈ ఫెస్ట్‌వల్ సోమవారం వరకూ కొనసాగుతుందన్నారు. -
అంబిటస్లో ఘనంగా ఫుడ్‌ఫెస్టివల్
సిద్దిపేటఎడ్యుకేషన్: ఆహా ఏమి రుచి అనరా మైమరచి.. అనే సినిమా పాటను మైమరిపించేలా పలు రకాల వంటకాలను తయారు చేసి స్థానిక అంబిటస్ పాఠశాలలో ప్రదర్శించారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన ఈ ఫుడ్‌ఫెస్టివల్ కార్యక్రమంలో సుమారు 100మంది పేరెంట్స్ వివిధ రకాల ఆధునిక, సాంప్రదాయ వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపల్ జ్యోతిలు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. జంక్ ఫుడ్‌తో పోశకాలున్న ఆహారాన్ని మర్చిపోతున్న ప్రస్తుత తరుణంలో సాంప్రదాయ వంటకాల ప్రాధాన్యతను తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నోవాటెల్‌లో కశ్మీరి ఫుడ్ ఫెస్టివల్
-
ఫుడ్ గుడ్!
వారంతా విద్యార్థినులు. పుస్తకాలే వారి లోకం. ఆటపాటలే వారికి ఆటవిడుపు. కానీ.. షడ్రుచుల సమ్మేళానికి సిద్ధమయ్యారు. పాకశాస్త్ర ప్రవీణులుగా మారారు. నోరూరించే వంటకాలతో అదరగొట్టారు. బుధవారం సోమాజిగూడలోని విల్లా మేరీ కళాశాలలో ‘ఫుడిస్తాన్– ఎ గాస్ట్రోనోమర్ ప్యారడైజ్’ పేరుతో నిర్వహించిన వంటల పోటీల్లో పలువురు విద్యార్థినులు పాల్గొన్నారు. దోసె, పానీపూరీ, పిజ్జా, మాగీ సహా ఐస్‌క్రీమ్ వరకు తయారు చేసి విక్రయించారు. కార్యక్రమానికి కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.ఫిలోమినా ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఫుడ్‌స్టాల్స్‌కు బహుమతులు అందించారు. ఆహార పదార్థాలు విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ‘స్వయంకృషి’ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. -
హోటల్ రాడిసన్‌లో సీ ఫుడ్ ఫెస్టివల్
-
ఫుడ్ లవర్స్ కోసం మరో ఫుడ్ ఫెస్టివల్
-
కరీంనగర్‌లోని స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్
-
డిసెంబర్ 2 నుంచి ఫుడ్ ఫెస్టివల్
హైదరాబాద్: డిసెంబర్ 2వ తేదీనుంచి ‘హఫ్’ సంస్థ ఆధ్వర్యంలో నగరంలో మూడు రోజులపాటు ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది. 2 నుంచి 4వ తేదీ వరకు హైటెక్స్‌లో నిర్వహించే ఈ ఫుడ్ ఫెస్టివల్లో ప్రపంచ ప్రసిద్ధ వంటకాలు నగరవాసులను ఊరించనున్నాయి. హైదరాబాదీ రుచులతోపాటు వివిధ దేశాలకు చెందిన వంటకాలు కొలువుదీరనున్నాయి. ఇందులో వంటకాలతోపాటు సంగీతం, ఆర్ట్ అదనపు ఆకర్షణలుగా నిలవనున్నాయి.