ఫుడ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న విద్యార్ధులు
సిద్దిపేటఎడ్యుకేషన్: ఆహా ఏమి రుచి అనరా మైమరచి.. అనే సినిమా పాటను మైమరిపించేలా పలు రకాల వంటకాలను తయారు చేసి స్థానిక అంబిటస్ పాఠశాలలో ప్రదర్శించారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన ఈ ఫుడ్‌ఫెస్టివల్ కార్యక్రమంలో సుమారు 100మంది పేరెంట్స్ వివిధ రకాల ఆధునిక, సాంప్రదాయ వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపల్ జ్యోతిలు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. జంక్ ఫుడ్‌తో పోశకాలున్న ఆహారాన్ని మర్చిపోతున్న ప్రస్తుత తరుణంలో సాంప్రదాయ వంటకాల ప్రాధాన్యతను తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment