జర్మనీలో మన రుచులు
పరిచయం చేసిన నిర్మల్ దంపతులు ఇండియన్ ఫుడ్‌ఫెస్టివల్‌లో ప్రశంసలు
నిర్మల్‌ఖిల్లా: జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో నిర్వహిహించిన ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్‌లో నిర్మల్‌కు చెందిన అజయ్‌కుమార్–శ్రీలత దంపతులు పాల్గొని ఇక్కడి తెలంగాణ సంప్రదాయ వంటకాలను పరిచయం చేశారు. అక్కడివారికి చికెన్ కర్రీ, బిర్యానీ, వడలు, సకినాలు, బూరెలు తదితర వంటకాల రుచి చూపించారు. జర్మనీ ప్రజలు డబల్ క మీఠా వంటకాన్ని ఇష్టంగా ఆరగించినట్లు వారు తెలిపారు. అక్కడి తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులతోపాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వారూ హాజరయ్యారు.
నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన అజయ్‌కుమార్–శ్రీలత దంపతులు చేసిన వంటకాలకు అక్కడి నిర్వాహకులు, స్థానికుల ప్రశంసలు దక్కాయి. ఇలాంటి ఫెస్టివల్స్ జరగడం ఎంతో ఆనందంగా ఉందని, తెలుగు ప్రజలతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల వారంతా ఒక్కచోట కలుసుకుని మన దేశ వంటకాలను రుచి చూసే అవకాశం కల్పించడాన్ని పలువురు అభినందించారు. మన దేశ వంటకాల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉందని అజయ్‌కుమార్–శ్రీలత దంపతులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment