
సాక్షి, ముంబై : టెలికాం సేవల్లో టాప్‌లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియో మరోసారి తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. దేశీయ అతిపెద్ద రెస్టారెంట్ టేబుల్ రిజర్వేషన్ సర్వీస్ సంస్థ డైన్అవుట్‌తో జియో జత కట్టింది. డైన్ అవుట్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ రెస్టారెంట్ ఫెస్టివల్‌కు రిలయన్స్ జియో డిజిటల్ భాగస్వామిగా మారి కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపును ఆఫర్ చేస్తోంది.
నేడు (2019 ఆగస్ట్ 1) మొదలైన ఈ ఫెస్టివల్ 2019 సెప్టెంబర్ 1వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, పూణె, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, చండీగఢ్, గోవా, జైపూర్, లక్నో, ఇండోర్, సూరత్, కొచ్చి, లుధియానా, నాగ్‌పూర్ నగరాల్లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది.
డైన్‌అవుట్ ద్వారా టేబుల్ రిజర్వేషన్స్ చేసేవారికి సాధారణంగా బుకింగ్ ఫీజు వసూలు చేస్తుంది. కానీ ఈ ప్లాట్‌ఫాంలో జియో యూజర్లు చేసుకునే మొదటి బుకింగ్‌పై రూ.100 తగ్గింపు లభిస్తుంది. ఇది జియో వినియోగదారులకు మాత్రమే ప్రత్యేకంగా. అలాగే బిల్లుపై పత్ర్యేక డిస్కౌంట్‌ను కూడా అందిస్తుంది. దీంతోపాటు ఫుడ్, డ్రింక్స్, బఫేపై 1+1 ఆఫర్స్ పొందొచ్చు.
డైన్అవుట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న 17 పట్టణాల్లో, ఎనిమిదివేలకు పైగా రెస్టారెంట్లలో ఈ తగ్గింపు లభిస్తుంది. అలాగే టోటల్ ఫుడ్ బిల్, డ్రింక్స్ బిల్, బఫేపై 50శాతం తగ్గింపు ఆఫర్. ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం జియో యూజర్లకు మాత్రమే. మైజియో యాప్ ద్వారా జియో యూజర్లు కూపన్స్ సెక్షన్‌లో డిస్కౌంట్ కోడ్ పొంది, డైన్అవుట్ ప్లాట్‌ఫామ్‌లో కూపన్స్ రీడీమ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment