Dineout
-
24 పరుగులకు ఐఫోన్ 15.. 36 పరుగులకు స్కోడా కారు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ ‘మ్యాచ్ డే మానియా’ ద్వారా క్యాష్‌ప్రైజ్‌ను ఆఫర్ చేయనుంది. క్రికెట్ వరల్డ్‌కప్ 2023 సందర్భంగా తన కష్టమర్లలో జోష్ నింపేందుకు వివిధ ప్రైజ్‌మనీతో అలరించనుంది. అక్టోబర్ 11 నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు రూ.150 తగ్గించనున్నట్లు కంపెనీ తెలిపింది. మ్యాచ్ డే మానియా ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ ధర ఆధారంగా వారి వాలెట్లో రన్స్ జమ అవుతాయి. 2 పరుగులకు స్విగ్గీ లేదా ఇన్‌స్టామార్ట్‌లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. 4 పరుగులకు డైనింగ్‌లో రాయితీపై డైన్అవుట్ ద్వారా బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 6 పరుగులు సాధిస్తే స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించవచ్చు. లేదంటే రూ.10000 స్విగ్గీమనీ సొంతం చేసుకోవచ్చు. ఇలా పరుగులు పెరుగుతున్న కొద్దీ తాజ్హోటల్లో బస, తనిష్క్ వోచర్ గెలుచుకోవచ్చు. 24 పరుగులకు ఐఫోన్ 15, 36 పరుగులకు స్కోడా కారు గెలుపొందే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. -
20 నగరాలు.. 50 వేల రెస్టారెంట్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫుడ్ డెలివరీ వేదిక స్విగ్గీ తాజాగా రెస్టారెంట్ టెక్ ప్లాట్‌ఫామ్ డైన్‌ఔట్‌ను కొనుగోలు చేస్తోంది. టైమ్స్ గ్రూప్ కంపెనీ అయిన ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీ టైమ్స్ ఇంటర్నెట్తో ఈ మేరకు స్విగ్గీ ఒప్పందం చేసుకుంది. 20 నగరాల్లో 50,000 పైచిలుకు రెస్టారెంట్లలో డిస్కౌంట్స్తోపాటు టేబుల్స్ రిజర్వ్ చేసుకునే సౌకర్యాన్ని డైన్ఔట్ కల్పిస్తోంది. కొనుగోలు తర్వాత కూడా డైన్ఔట్ స్వతంత్య్ర యాప్‌గానే కొనసాగుతుందని స్విగ్గీ శుక్రవారం ప్రకటించింది. ఇంటర్నెట్ ఆధారిత ఉత్పత్తులు, సేవలు, సాంకేతిక కంపెనీలను టైమ్స్ ఇంటర్నెట్ కలిగి ఉంది. కంపెనీల నిర్వహణ, పెట్టుబడులను కొనసాగిస్తోంది. చదవండి: Infosys: కేంద్రం వర్సెస్ ఇన్ఫోసిస్.. బిగుస్తున్న పీటముడి -
ఈ విషయంలో ప్రేమ జంటలకు ఉదయ్‌పూర్, ఫ్యామిలీలకు ఆగ్రా..
న్యూఢిల్లీ: తమకు ఇష్టమైన ఆహారాన్ని నచ్చిన రెస్టారెంట్‌కు వెళ్లి తినే వారి సంఖ్య పెరుగుతోంది. తీరికలేని జీవనశైలిలో.. కొంచెం సమయం లభించినా మనసుకు నచ్చే రుచులను ఆస్వాదించేందుకు వారు మొగ్గు చూపిస్తున్నారు. 2021లో ఏకంగా 4.5 కోట్ల మంది రెస్టారెంట్లకు వెళ్లి తమ జిహ్వ కోరికలను నెరవేర్చుకున్నట్టు ‘డైన్ అవుట్’ సంస్థ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. సగటున వీరు చెల్లించిన ఒక్కో బిల్లు రూ.2,670గా ఉంది. 2020లో ఇది రూ.1,907గానే ఉండడం గమనించాలి. అంటే గతేడాది వీరంతా కలసి రూ.12,015 కోట్లను నచ్చిన ఆహారంపై ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, రెస్టారెంట్లలో టేబుళ్లను బుక్ చేసుకోవడం ద్వారా వీరు రూ.1,360 కోట్ల ఆదా చేసుకున్నట్టు ఈ నివేదిక తెలిపింది. గంటకు 8,588 టేబుళ్లు రెస్టారెంట్లలో బుక్ అయ్యాయి. ఢిల్లీ వాసులే ముందు.. డైనింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా (రెస్టారెంట్ భోజనానికి రాజధాని)గా ఢిల్లీని ఈ నివేదిక పేర్కొంది. వరుసగా మూడో ఏడాది ఈ ఖ్యాతిని దక్కించుకుంది. 32 శాతం మంది రెస్టారెంట్ల భోజన ప్రియులు ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత 18 శాతం మందితో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. వీటికి ప్రాధాన్యం.. బటర్ చికెన్, దాల్ మఖాని, నాన్ ఎక్కువగా తిన్న పదార్థాలలో ఉన్నాయి. 38 శాతం ఉత్తరాది ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వగా.. చైనీస్ వంటకాలకు 18 శాతం, కాంటినెంటల్ (యూరోపియన్) వంటకాలను 16 శాతం మంది ఆర్డర్ చేశారు. టేబుల్‌కు ఇద్దరే.. ప్రేమ జంటలకు ఉదయ్‌పూర్ రాజధానిగా నిలిచింది. ఇందుకు నిదర్శనంగా ఈ పట్టణంలో రెస్టారెంట్లలో 44 శాతం బుకింగ్‌లు ఇద్దరి కోసం చేసుకున్నవే ఉన్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల బృందాలు ఎక్కువగా ఆగ్రా, లుధియానాలో రెస్టారెంట్లకు వెళుతున్నారు. ఇక్కడ ఒక టేబుల్‌ను నలుగురి కోసం బుక్ చేసుకున్నారు. ఖర్చు చేయడానికి వీలుగా బ్యాలన్స్ ఉండడం, ఇంటి నుంచే పని విధానంతో దేశవ్యాప్తంగా ఖరీదైన ఆహార సేవనం 120 శాతం పెరిగినట్టు ఈ నివేదిక తెలియజేసింది. అలాగే, నాణ్యమైన రెస్టారెంట్లలో భోజనాలు కూడా 105 శాతం పెరిగినట్టు పేర్కొంది. లిక్కర్ క్యాపిటల్ గా బెంగళూరు గత డిసెంబర్లో బెంగళూరు నగరం 50,000 లీటర్ల ఆల్కహాల్‌ను వినియోగించుకుంది. దీంతో 2021 సంవత్సరానికి లిక్కర్ రాజధానిగా బెంగళూరును ఈ నివేదిక ప్రస్తావించింది. రెస్టారెంట్లలో రాత్రి భోజనానికి (డిన్నర్) ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఆగ్రాలో 59.3 శాతం మంది రెస్టారెంట్లలో డిన్నర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. చెన్నై వాసులు 47 శాతం మంది మధ్యాహ్న భోజనాన్ని రెస్టారెంట్లలో తినేందుకు ఇష్టపడుతున్నారు. ఢిల్లీలోని కన్నౌట్ ప్లేస్ ప్రముఖ రెస్టారెంట్ల ప్రాంతంగా ఉంది. ముంబైలోని లోయర్ పారెల్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, చెన్నైలోని త్యాగరాయ నగర్, కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతాలు కూడా ఈ కోవలోకే వస్తాయని డైన్అవుట్ నివేదిక వివరించింది. చదవండి:లగ్జరీ ఫుడ్ స్టోర్ వ్యాపారంలో అడుగుపెట్టిన టాటా గ్రూప్..! -
ఫుడ్ లవర్స్‌కు జియో బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై : టెలికాం సేవల్లో టాప్‌లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియో మరోసారి తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. దేశీయ అతిపెద్ద రెస్టారెంట్ టేబుల్ రిజర్వేషన్ సర్వీస్ సంస్థ డైన్అవుట్తో జియో జత కట్టింది. డైన్ అవుట్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ రెస్టారెంట్ ఫెస్టివల్‌కు రిలయన్స్ జియో డిజిటల్ భాగస్వామిగా మారి కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపును ఆఫర్ చేస్తోంది. నేడు (2019 ఆగస్ట్ 1) మొదలైన ఈ ఫెస్టివల్ 2019 సెప్టెంబర్ 1వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, పూణె, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, చండీగఢ్, గోవా, జైపూర్, లక్నో, ఇండోర్, సూరత్, కొచ్చి, లుధియానా, నాగ్‌పూర్ నగరాల్లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. డైన్అవుట్ ద్వారా టేబుల్ రిజర్వేషన్స్ చేసేవారికి సాధారణంగా బుకింగ్ ఫీజు వసూలు చేస్తుంది. కానీ ఈ ప్లాట్‌ఫాంలో జియో యూజర్లు చేసుకునే మొదటి బుకింగ్‌పై రూ.100 తగ్గింపు లభిస్తుంది. ఇది జియో వినియోగదారులకు మాత్రమే ప్రత్యేకంగా. అలాగే బిల్లుపై పత్ర్యేక డిస్కౌంట్‌ను కూడా అందిస్తుంది. దీంతోపాటు ఫుడ్, డ్రింక్స్, బఫేపై 1+1 ఆఫర్స్ పొందొచ్చు. డైన్అవుట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న 17 పట్టణాల్లో, ఎనిమిదివేలకు పైగా రెస్టారెంట్లలో ఈ తగ్గింపు లభిస్తుంది. అలాగే టోటల్ ఫుడ్ బిల్, డ్రింక్స్ బిల్, బఫేపై 50శాతం తగ్గింపు ఆఫర్. ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం జియో యూజర్లకు మాత్రమే. మైజియో యాప్ ద్వారా జియో యూజర్లు కూపన్స్ సెక్షన్లో డిస్కౌంట్ కోడ్ పొంది, డైన్అవుట్ ప్లాట్ఫామ్లో కూపన్స్ రీడీమ్ చేసుకోవచ్చు. -
డైన్అవుట్ చేతికి ఇన్‌రెస్టో సర్వీస్
న్యూఢిల్లీ: టేబుల్ రిజర్వేషన్ ప్లాట్‌ఫామ్ డైన్అవుట్ బెంగళూరుకు చెందిన ఇన్‌రెస్టో సర్వీస్‌ను కొనుగోలు చేసింది. అయితే ఎంత ధరకు కొనుగోలు చేసింది వెల్లడించలేదు. ఇన్‌రెస్టో సర్వీస్ కొనుగోలుతో తాము వినియోగదారులకు పూర్తి స్థాయిలో సేవలందించగలమని డైన్ అవుట్ వెల్లడించింది. టేబుల్ రిజర్వేషన్లు, హోమ్ డెలివరీ అన్ని సేవలు అందించగలమని వివరించింది.