
వారంతా విద్యార్థినులు. పుస్తకాలే వారి లోకం. ఆటపాటలే వారికి ఆటవిడుపు. కానీ.. షడ్రుచుల సమ్మేళానికి సిద్ధమయ్యారు. పాకశాస్త్ర ప్రవీణులుగా మారారు. నోరూరించే వంటకాలతో అదరగొట్టారు. బుధవారం సోమాజిగూడలోని విల్లా మేరీ కళాశాలలో ‘ఫుడిస్తాన్– ఎ గాస్ట్రోనోమర్ ప్యారడైజ్’ పేరుతో నిర్వహించిన వంటల పోటీల్లో పలువురు విద్యార్థినులు పాల్గొన్నారు. దోసె, పానీపూరీ, పిజ్జా, మాగీ సహా ఐస్‌క్రీమ్ వరకు తయారు చేసి విక్రయించారు.
కార్యక్రమానికి కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.ఫిలోమినా ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఫుడ్‌స్టాల్స్‌కు బహుమతులు అందించారు. ఆహార పదార్థాలు విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ‘స్వయంకృషి’ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment