వినండి.. తినండి | Food Mania Festival In RK Beach Vizag | Sakshi
Sakshi News home page

వినండి.. తినండి

Apr 23 2018 8:54 AM | Updated on May 3 2018 3:20 PM

Food Mania Festival In RK Beach Vizag - Sakshi

చికెన్‌ తందూరి తింటున్న చిన్నారి

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : మండే ఎండాకాలంలో సాగరతీరంఓ అద్భుత ప్రాంతం. చల్లని గాలులతో సేద తీరేందుకు చక్కటి విడిది. అందమైన తీరం..మరో వైపు హోరెత్తించే పాటలు ఇలాంటి వాతావరణంలో సిటిజనులు గంటల తరబడి ఉండిపోతారు. మరి ఇలాంటి సమయంలో నచ్చిన ఫుడ్‌ ఉంటే వావ్‌.. భలే ఉంటుంది కదూ. ఇటువంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్‌ టూరిజం సహకారంతో ఫుడ్‌ మానియా ఫెస్ట్‌ ఆర్కే బీచ్‌లో నిర్వహిస్తున్నారు.

ఫుడ్‌తో పాటు ఆహ్లాదకరమైన మ్యూజిక్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లకు నగరవాసులు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు వినోద్‌ మాట్లాడుతూ ప్రతి ఏటా ఇలాంటి ఫుడ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించడం జరగుతుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఫుడ్‌ ఐటమ్స్‌ నగర వాసులకు అందుబాటులో ఉంచామన్నారు. ఈ ఫెస్ట్‌వల్‌ సోమవారం వరకూ కొనసాగుతుందన్నారు.

1
1/1

పాటలతో హోరెత్తిస్తున్న సింగర్స్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement