హరియాణా: కరోనా విలయంతో దేశమంతా అతలాకుతలమవుతోంది. కరోనా వైరస్ కేసుల ఉధృతి నేపథ్యంలో పలు ఆసుపత్రులలో మెడికల్ ఆక్సిజన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు లేక రోగులు అల్లాడిపోతున్నారు. ఇది ఇలా ఉంటే ఆక్సిజన్ తీసుకెళతుఉన్న ట్యాంకర్ తప్పి పోవడం కలకలం రేపింది. హర్యానాలోని పానిపట్ నుండి సిర్సాకు ప్రయాణిస్తున్న లిక్విడ్ ఆక్సిజన్ తీసుకెళ్తున్న ట్యాంకర్ తప్పిపోయింది. దీనిపై హతాశులైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పానిపట్ ప్లాంట్ నుండి ద్రవ ఆక్సిజన్‌తో నిండిన తరువాత, ట్రక్ సిర్సాకు బుధవారం బయలుదేరింది. కానీ నిర్దేశిక సమయానికి గమ్యస్థానానికి చేరుకోలేదు. ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారి మంజీత్ సింగ్ ధృవీకరించారు. జిల్లా డ్రగ్ కంట్రోలర్ ఫిర్యాదుపై శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కాగా మరో ఘటనలో హర్యానా మంత్రి అనిల్ విజ్ పానిపట్ నుండి ఫరీదాబాద్‌కు వెళుతున్న మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఢిల్లీ ప్రభుత్వం దోపిడీ చేసిందని బుధవారం ఆరోపించిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment