కరీంనగర్: వేగంగా వెళ్తున్న డీసీఎం వ్యాను ఢీ కొనడంతో ఇద్దరు మున్సిపల్ కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం కరీంనగర్ జిల్లా కోరుట్ల మండల కేంద్రంలో బస్టాండ్ ఎదురుగా జరిగింది. వివరాలు..కోరుట్లకు చెందిన చిట్యాల పెదగంగారం(40), బొల్లె గంగు(44)లు మున్సిపల్ కార్మికులుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయం 5 గంటల ప్రాంతంలో బస్టాండ్ ఎదురుగా టీ తాగి రోడ్డు దాటుతుండగా అటుగా వచ్చిన వ్యాన్ ఢీ కొట్టింది.
దీంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.