రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి | road accident filed | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

Published Sun, Aug 21 2016 11:35 PM | Last Updated on Sat, Jul 6 2019 12:36 PM

road accident filed

బంటుమిల్లి : 
స్థానిక దుర్గామహల్‌ వద్ద బంటుమిల్లి–గుడివాడ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని నాగేశ్వరరావుపేట గ్రామానికి చెందిన ముక్కు వీరాస్వామి(70) పుష్కరా స్నానాలకు వెళ్లి వచ్చాడు.  బస్‌ దిగిన అనంతరం బంటుమిల్లి వైపు నడిచి వెళ్తుండగా సమీపంలోని పెట్రోలు బంక్‌లో ఆయిల్‌ అన్‌లోడ్‌ చేసి వస్తున్న ఆయిల్‌ టాంకర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరాస్వామి అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ ఎం.నవీన్‌ పంచనామా అనంతరం మృతదేహాన్ని బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement