
ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి
హైదరాబాద్ (జీడిమెట్ల): నగరంలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని ట్యాంకర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జీడిమెట్లలో చోటుచేసుకుంది. వివరాలు...గండి మైసమ్మ ఆలయం నుంచి సుధీర్ (30) చింతల్ వైపు బైక్‌పై వస్తుండగా మలుపు వద్ద జారిపడటంతో వెనక నుంచి వస్తున్న ట్యాంకర్ అతని పై నుంచి వెళ్లింది. దీంతో సుధీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చింతల్ ప్రాంతవాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.