
ఇండియాలోనే అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ ఖాతాలో మరో కంపెనీ వచ్చి చేరింది. థర్డ్ పార్టీ మెరైన్ సర్వీసులు అందిస్తున్న ఓషియన్ స్పార్కిల్ సంస్థను అదాని గ్రూపుకు చెందిన ఆదానీ హర్బర్ సర్వీసెస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇందు కోసం రూ.1530 కోట్లను అదానీ హర్బర్ సర్వీసెస్ వెచ్చించింది.
ఇండియాలో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ 2030 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించడం తమ లక్ష్యమని ఆదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ సీఈవో కరన్ అదానీ తెలిపారు. తాజాగా కుదిరిన డీల్ వల్ల రాబోయే ఐదేళ్లలో ఓషియన్ స్పార్కిల్ లాభాలు రెట్టింపు అవుతాయని వెల్లడించారయన.
ఓషియన్ స్పార్కిల్ సంస్థ 1995లో ఏర్పాటైంది. ఇండియాతో పాటు శ్రీలంక, సౌదీ అరేబియా, ఒమన్, ఖతర్, ఆఫ్రికా దేశాల్లో సేవలు కొనసాగిస్తోంది. ఇండియాలో ఉన్న మేజర్, మైనర్ పోర్టుల్లో ఓషియన్ స్పార్కిల్ పని చేస్తోంది. ఈ కంపెనీలో దేశవ్యాప్తంగా 1800ల మంది పని చేస్తున్నారు.
చదవండి: Multibagger Stock: అదానినే కాదు అతన్ని నమ్ముకున్నవాళ్లు బాగుపడ్డారు!
Comments
Please login to add a commentAdd a comment