చేపలలో చేపలా...
స్కూబా డైవింగ్
సముద్రపు నీటిలో వేగంగా, చల్లచల్లగా ఈదులాడే సాహసక్రీడ పేరు స్కూబా డైవింగ్. ప్రపంచంలో పేరెన్నికగన్న స్కూబా డైవింగ్ ప్రాంతాలు...
ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన డైవింగ్ ప్రదేశాలలో ఒకటి. ఇది మూడు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో అతి పెద్ద పగడపు దిబ్బలు కలిగిన ప్రదేశం. నీటిలో ఈదుతూ... సముద్రపు తాబేళ్లు, డాల్ఫిన్లు, వేల రకాల చేపలను చూడొచ్చు.
ప్రపంచంలో అత్యంత అందమైన సముద్ర తీరాలలో ఎర్రసముద్రం ప్రఖ్యాతి గాంచింది. ఈజిప్టు పర్యాటక ఆకర్షణలో ప్రధానమైన ఈ సముద్రంలో డైవింగ్ మరిచిపోలేని అనుభూతి.
భారత దేశంలో 572 చిన్న చిన్న ద్వీపాలు గల అండమాన్ నికోబార్ దీవుల్లోని హ్యావ్‌లాక్ దీవిలో స్కూబా డైవింగ్ అంటే జీవితకాలపు ఊహించని ఆనందాన్ని మదిలో నిలుపుకున్నట్టే!