
పాట్నా: బిహార్ కొత్త డిప్యూటీ సీఎంలలో ఒకరైన సామ్రాట్ చౌదరి కాషాయ తలపాగా వెనుక ఆసక్తికరమైన కథ దాగి ఉంది. గతంలో నితీశ్ బీజేపీని వదిలి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పట్లో ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సామ్రాట్ ఒక శపథం చేశారు.
నితీశ్ కుమార్‌ను గద్దె దించిన తర్వాతే తాను తలపాగా తీస్తానని ప్రతిన పూనారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య నితీశ్ తాజాగా బిహార్‌లో మళ్లీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, కొత్తగా ఏర్పాటైన ఎన్‌డీఏ ప్రభుత్వంలో సామ్రాట్ చౌదరి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి.
దీంతో మీడియా ప్రతినిధులు సామ్రాట్‌కు తన తలపాగాపై ప్రశ్నలు సంధించారు. దీనికి స్పందించిన సామ్రాట్ బీజేపీ తనకు రెండో తల్లిలాంటిదని, అయోధ్యకు వెళ్లినపుడు రాముడిని దర్శించుకునేందుకు తల వంచేందుకు వీలుగా తలపాగా తీసేస్తానని సామ్రాట్ నర్మగర్భంగా సమాధానిమిచ్చారు. సామ్రాట్ 2018లో నితీశ్‌కుమార్ పార్టీ జేడీయూను వీడి బీజేపీలో చేరడం గమనార్హం.
मुरेठा खोलने पर सम्राट बोले : मुरेठा के सम्मान में अगर मुझे अयोध्या जाकर सिर मुड़वाना पड़े तो मैं तैयार हूं#BiharCM #Bihar #BiharNews #BJP #SamratChaudhary @RJDforIndia @RohiniAcharya2 pic.twitter.com/bBOmAsDXiQ
— FirstBiharJharkhand (@firstbiharnews) January 29, 2024
ఇదీచదవండి.. మోదీ మళ్లీ పీఎం అయితే.. ఖర్గే కీలక వ్యాఖ్యలు