ప్రమాదధాటికి రెండుగా విడిపోయిన ట్రాక్టర్
చౌటుప్పల్ (మునుగోడు) : కారు ట్రాక్టర్‌ను ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని లక్కారం గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా జహీరాబాద్ నుంచి కొత్త ట్రాక్టర్‌ను నల్లగొండ జిల్లా కోదాడకు తీసుకెళ్తున్నారు. లక్కారం శివారులోని ఎల్‌డీఆర్ ఎస్టేట్ గేటు ముందుకు రాగానే వెనుక నుంచి వచ్చిన వర్నా కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ రెండు భాగాలుగా విడిపోయి రహదారిపై పడింది.
ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కుట్టి రామకృష్ణ(62) తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ట్రాక్టర్‌ను డీకొట్టిన కారులోని వ్యక్తులకు ఎలాంటి గాయాలవ్వలేదు. కారుఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదాన్ని గుర్తించిన వెనుక నుంచే వస్తున్న మరో ట్రాక్టర్ డ్రైవర్ అద్దంకి వీరయ్య పోలీసులకు సమాచారమిచ్చాడు. చికిత్స నిమిత్తం ట్రాక్టర్ డ్రైవర్‌ను హైదరాబాద్‌కు తరలించారు. వీరయ్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చిల్లా సాయిలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment