నల్లగొండ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. నకిరేకల్ మండలం నోముల శివారులో బైక్, ట్రాక్టర్ను ఢీకొనడంతో ఒక్కరు అక్కడిక్కడే మృతిచెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
నకిరేకల్: నల్లగొండ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. నకిరేకల్ మండలం నోముల శివారులో బైక్, ట్రాక్టర్ను ఢీకొనడంతో ఒక్కరు అక్కడిక్కడే మృతిచెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
అతివేగంగా వచ్చిన బైక్ ట్రాక్టర్‌పైకి వడ్ల బస్తాలను ఎక్కిస్తున్న హమాలీను బలంగా ఢీకొట్టింది. దీంతో హమాలీ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.