Nitin Gadkari Said Proposal Mandating A Minimum Of 6 Airbags In Passenger Cars - Sakshi
Sakshi News home page

కేంద్రం కీలక ఆదేశాలు : కార్లలో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు..తగ్గే ప్రసక్తే లేదు

Published Thu, Sep 29 2022 2:42 PM | Last Updated on Thu, Sep 29 2022 3:38 PM

Nitin Gadkari Said Proposal Mandating A Minimum Of 6 Airbags In Passenger Cars - Sakshi

కార్ల విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది అక్టోబర్‌ 1 నుంచి కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగ్స్‌ తప్పని సరిగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఎయిర్‌ బ్యాగుల అంశంపై స్పందించారు. ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న గ్లోబల్‌ సప్లయి చైన్‌ అవరోధాలు, మైక్రో ఎకనామిక్స్‌ (స్థూల ఆర్థిక) పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ప్యాసింజర్ కార్లలో (ఎం-1 వేరియంట్‌) కార్ల ధర, వేరియంట్‌లతో సంబంధం లేకుండా వచ్చే ఏడాది అక్టోబర్‌1, 2023 వరకు ఆరు ఎయిర్‌ బ్యాగులు ఉండాల్సిందేనని నితిన్‌ గడ్కరీ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

కార్ల ధరలు పెరుగుతాయ్‌
కేంద్రం ఈ ఏడాది  అన్ని కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగులు ఉండాలనే నిబంధనల్ని అమలు చేసేందుకు ప్రయత్నించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని కార్ల తయారీ సంస్థలు వ్యతిరేకించాయి. ఎయిర్‌ బ్యాగుల్ని పెంచితే.. కార్ల ధరలు పెరుగుతాయని తద్వారా ఆ భారం తయారీ సంస్థలపై, కార్ల కొనుగోలు దారులపై పడుతుందని స్పష్టం చేశాయి. 

నిబంధనల సవరింపు 
ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగులు ఉండాలన్న నిబంధనల్ని సవరించింది. కేవలం 8 సీట్లున్న (ఎం -1 వేరియంట్‌ కార్లు) కార్లలో మాత్రమే ఎయిర్‌ బ్యాగులు ఉండాలని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement