'ఇస్మార్ట్ శంకర్' బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్‌తో మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఆ చిత్రం బంపర్ హిట్ అయనా ఎందుకో ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కుర్రకారు మతి పోగొట్టేంత అందం ఉన్నా.. అదృష్టం దక్కని నటీమణుల్లో నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు.
ఇస్మార్ట్ శంకర్ చిత్రం సంచలన విజయం సాధించినా నిధి అగర్వాల్‌కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. దీంతో ఈశ్వరన్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. అక్కడ తమిళ స్టార్ హీరో శింబుతో ప్రేమాయణంతో బోలెడంత పబ్లిసిటీ దొరికింది. శింబుతో నిధి అగర్వాల్ ప్రేమ కలాపాలు అంటూ కోలీవుడ్ కోడూ కూస్తుంది. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే నిధి అగర్వాల్ తన అందం వెనకున్న సీక్రెట్‌ను బయటపెట్టేసింది. ఆమె ఏం చెప్పిందంటే..పొద్దున్నే లెమన్ జ్యూస్ తాగుతాను. నా డైట్‌లో తాజా పండ్లు తప్పకుండా ఉంటాయి. అలాగే తగినన్ని మంచినీళ్లూ తాగుతుంటాను. ట్యాన్ ఫ్రీ స్కిన్ కోసం.. సమయం చిక్కినప్పుడల్లా టొమాటో గుజ్జును చేతులు, కాళ్ల మీద అప్లయ్ చేస్తాను. ఇక ఫేస్‌ప్యాక్ విషయానికి వస్తే పెరుగులో కొంచెం తేనె, కాసింత నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటాను. దీంతో ముఖం నున్నగా.. కాంతిమంతంగా మారుతుంది అంటూ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment