Sai Pallavi Reveals Her Beauty Secret, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Sai Pallavi Beauty Secret: 'వాటికి దూరంగా ఉంటాను.. అదే నా రహస్యం', సీక్రెట్‌ రివీల్‌ చేసిన సాయిపల్లవి

Published Mon, Jul 24 2023 10:30 AM | Last Updated on Mon, Jul 24 2023 2:23 PM

Sai Pallavi Reveals Her Beauty Secret Check Out - Sakshi

హీరోయిన్‌ సాయిపల్లవి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేచురల్‌ బ్యూటీగా, లేడీ పవర్‌ స్టార్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్‌ స్టేటస్‌ని సొంతం చేసుకుంది. ‍ప్రేమమ్‌ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సాయిపల్లవి తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచేసింది.

గ్లామర్‌కు దూరంగా, నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తనకంటూ సెపరేట్‌ స్టైల్‌ని క్రియేట్‌ చేసుకుంది. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే ఇప్పటిదాకా తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూ వచ్చిన సాయిపల్లవి అనూహ్యంగా గ్యాప్‌ తీసుకుంది.

ఇప్పుడు ఈమె చేతిలో కమలహాసన్‌ నిర్మించనున్న ఓ సినిమా మాత్రమే ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే సాయిపల్లవి మేకప్‌ లేకపోయినా ఎంతో అందంగా ఉంటుంది. దాని వెనుకున్న బ్యూటీ సీక్రెట్‌ను ఆమె బయటపెట్టింది. ''తాజా ఆకుకూరలు, కూరగాయలు, పళ్లు తీసుకుంటాను. కెమికల్‌ బ్యూటీ ప్రొడక్ట్స్‌కి నేను దూరం. వారంలో కనీసం మూడు రోజులు ఎక్సర్‌సైజ్‌ చేస్తాను. తగినన్ని మంచినీళ్లు తాగుతాను'' అంటూ తన అందం వెనకున్నరహస్యాన్ని బయటపెట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement