Rakul Preet Singh Reveals Her Beauty Secrets For Glowing Skin - Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందం వెనకున్న సీక్రెట్‌ తెలుసా?

Published Mon, Jul 10 2023 10:18 AM | Last Updated on Fri, Jul 14 2023 3:21 PM

Rakul Preet Singh Reveals Her Beauty Secrets - Sakshi

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రకుల్‌ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ నటించి తనదైన గుర్తింపు తెచ్చుకుంది.

టాలీవుడ్‌లో దూరమయ్యాక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది. అయితే ఇటీవల తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.ఇక ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే రకుల్‌ తన అందం వెనకున్న సీక్రెట్‌ను బయటపెట్టింది.

రోజు విడిచి రోజు స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో ముఖానికి, మెడకు మసాజ్‌ చేసుకుంటాను. ముఖం,మెడ మీది ట్యాన్‌ పోవడానికి వీలైనప్పుడల్లా టొమాటోతో రుద్దుకుంటాను. పెరుగులో పసుపు, శనగపిండి కలిపి దాన్ని ప్యాక్‌లా వేసుకుంటాను. 
-రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement