నీ అందం రహస్యం ఏమిటో! | taapsee pannu beauty secret ? | Sakshi
Sakshi News home page

నీ అందం రహస్యం ఏమిటో!

Published Fri, Jun 12 2015 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

నీ అందం రహస్యం ఏమిటో!

నీ అందం రహస్యం ఏమిటో!

 కోలీవుడ్‌లో హీరోయిన్ల హీరో ఎవరంటే వచ్చే సమాధానం ఆర్య అనే. ఈయన బిరియాని పెట్టి హీరోయిన్లను బుట్టలో పడేసుకుంటారనే ప్రచారం ఉంది. నయనతార, త్రిష, హన్సిక ఇలా అందరూ ఆర్యను ఇష్టపడతారు. నటి ఎమిజాక్సన్ అయితే నా తొలి హీరో అంటూ తెగపొగిడేస్తుంది. నటి త్రిష ఆర్య నా డార్లింగ్ అంటున్నారు. ఆరంభం చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం కొనసాగుతోందట.
 
 ఇక అసలు విషయం ఏమిటంటే మామూలుగానే హీరోయిన్లకు జోకులతో ఆటపట్టించే ఆర్య తాజాగా ట్విట్టర్‌లోకి ఎంటర్ అయ్యారు. ఇంకేముంది ట్విట్టర్‌లో తన చిలిపి చేష్టలతో మరీ రెచ్చిపోతున్నారు. ఇటీవల నటి తాప్సీ గురించి ట్విట్టర్‌లో పేర్కొంటూ నువ్వు చాలా అందంగా ఉంటావు. దాని రహస్యం ఏమిటో చెప్పవా? డార్లింగ్ అంటూ కవ్వించారట. అందుకు ఆమె నీకు వేరే పని లేదా? అంటూ చిరు కోపంతోనే చికాకు పడిందట. అయినా వదలకుండా ఆర్య నిజంగానే పనిలేదుగాని నేనడిగిన దానికి బదులివ్వలేదు అంటూ ఆటపట్టించారట. ఇలా హీరోయిన్లతో జోవియల్‌గా ఉండడం ఆర్య హాబీ. అందుకే ఆ భామలు ఇష్టపడతారనుకుంటా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement