భారత వైమానిక దళంలో మృత్యు విహంగంగా పేరొందిన మిగ్-21 మరో పైలట్ ప్రాణాలను బలిగొంది.
భారత వైమానిక దళంలో మృత్యు విహంగంగా పేరొందిన మిగ్-21 మరో పైలట్ ప్రాణాలను బలిగొంది. జమ్ము కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా బిజ్బెహరా ప్రాంతంలో ఈ విమానం కుప్పకూలింది. దాంత పైలట్ అక్కడికక్కడే మరణించాడు. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా వెళ్లిన ఈ విమానం పొలాల్లో కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
విమాన పైలట్ రఘు వంశీ ఈ ప్రమాదంలో మరణించారు. మంగళవారం ఉదయం టెక్నికల్ ఎయిర్పోర్టు నుంచి ఈ ఉదయమే ఈ మిగ్-21 విమానం టేకాఫ్ తీసుకుంది. అది ఎందుకు కూలిపోయిందన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. భారత వైమానిక దళం అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.