కూలిన ట్రైనీ విమానం; ఇద్దరు పైలట్ల మృతి | Trainee Pilot Has Died In Plain Crash Near Bantwaram Vikarabad | Sakshi
Sakshi News home page

కూలిన ట్రైనీ విమానం; ఇద్దరు పైలట్ల మృతి

Published Sun, Oct 6 2019 1:47 PM | Last Updated on Sun, Oct 6 2019 9:10 PM

Trainee Pilot Has Died In Plain Crash Near Bantwaram Vikarabad - Sakshi

సాక్షి, వికారాబాద్ : వికారాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బేగంపేట విమానాశ‍్రయానికి చెందిన ఓ శిక్షణా విమానం బంట్వారం మండలం సుల్తాన్ పూర్ గ్రామ సమీపంలోని పంటపొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ట్రైనీ పైలట్లు మృతి చెందినట్లు తెలుస్తుంది. వర్షం కారణంగా విమానం అదుపుతప్పి బురదలో కూరుకుపోయినట్లు తెలుస్తుంది. కాగా, సమాచారం అందుకున్న వెంటనే బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో ట్రైనీ పైలట్‌ ప్రకాష్ విశాల్‌తో పాటు ఓ మహిళా పైలట్‌ కూడా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement