కీసర: కీసర ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డుప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్ దుర్మరణం చెందిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కీసర ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం నేరేడ్‌మెట్‌లో నివాసం ఉంటున్న సిద్దిపేట జిల్లాకు చెందిన గంగుమల శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు శ్రీకరణ్‌రెడ్డి(25) బ్యాంకాక్‌లో పైలట్ శిక్షణ పొందుతున్నాడు.
వారంరోజుల క్రితం సిటీకి వచి్చన శ్రీకరణ్‌రెడ్డి సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు యాదగిరిగుట్టకు వెళ్లివస్తానని తల్లిదండ్రులకు చెప్పి కారులో బయలుదేరాడు. నేరేడ్‌మెట్ ఈసీఐఎల్ నుండి కారులో వచ్చి కీసర వద్ద అవుటర్ రింగురోడ్డు ఎక్కాడు. రింగురోడ్డుపై ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు.
దీంతో కారుముందు భాగం పూర్తిగా నుజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకరణ్‌రెడ్డిని చికిత్స నిమిత్తం ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే అతను మృతిచెందాడు.
కాగా ప్రమాదానికి గురైన కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో అతను వేగంగా వెళ్లి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి ఉంటాడని పోలీసులు తెలిపారు. రింగు రోడ్డుపై ప్రమాదం జరిగిన చోట ఎలాంటి వాహనం కని్పంచలేదని చెప్పారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment