orr accident
-
ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం: ట్రైనీ పైలట్ దుర్మరణం
కీసర: కీసర ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డుప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్ దుర్మరణం చెందిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కీసర ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం నేరేడ్మెట్లో నివాసం ఉంటున్న సిద్దిపేట జిల్లాకు చెందిన గంగుమల శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు శ్రీకరణ్రెడ్డి(25) బ్యాంకాక్‌లో పైలట్ శిక్షణ పొందుతున్నాడు. వారంరోజుల క్రితం సిటీకి వచి్చన శ్రీకరణ్రెడ్డి సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు యాదగిరిగుట్టకు వెళ్లివస్తానని తల్లిదండ్రులకు చెప్పి కారులో బయలుదేరాడు. నేరేడ్మెట్ ఈసీఐఎల్ నుండి కారులో వచ్చి కీసర వద్ద అవుటర్ రింగురోడ్డు ఎక్కాడు. రింగురోడ్డుపై ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. దీంతో కారుముందు భాగం పూర్తిగా నుజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకరణ్రెడ్డిని చికిత్స నిమిత్తం ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే అతను మృతిచెందాడు. కాగా ప్రమాదానికి గురైన కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో అతను వేగంగా వెళ్లి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి ఉంటాడని పోలీసులు తెలిపారు. రింగు రోడ్డుపై ప్రమాదం జరిగిన చోట ఎలాంటి వాహనం కని్పంచలేదని చెప్పారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ఢీకొట్టింది వాహనానికా.. రెయిలింగ్‌కా..?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కంటోన్మెంట్ ఎమ్మెల్యే జ్ఞాన లాస్య నందిత కారు ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పోలీసులు ఇంకా ఓ నిర్ధారణకు రాలేక పోతున్నారు. నందిత ప్రయాణిస్తున్న కారు గుర్తు తెలియని వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీ కొట్టిన తర్వాత.. అదుపు తప్పి అతి వేగంగా వెళ్లి రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌కు గుద్దుకుందా? లేదా డైరెక్ట్‌గా రెయిలింగ్‌కు ఢీకొట్టిందా.. అనే దానిపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణకు రాలేకపోతున్నారని సమాచారం. ఈ రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు.. ఇప్పటికే కారు నడుపుతున్న ఎమ్మెల్యే పీఏ ఆకాష్ వద్ద స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ప్రమాదం జరిగినప్పుడు కళ్లు బైర్లు కమ్ముకున్నట్లు ఆయన పేర్కొన్నట్లు సమాచారం. వాహనంపై రోబోసాండ్ రేణువులు.. ప్రమాదానికి గురైన వీరి వాహనం ఎస్ఎల్–6 కారుపై రోబోసాండ్ రేణువులు పడి ఉన్నాయి. దీనిని బట్టి ఈ వాహనం టిప్పర్‌ను ఢీకొట్టిందనే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఓఆర్ఆర్పై ఉన్న టోల్గేట్ల వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తే.. ఆ సమయంలో సుమారు 15 నుంచి 20 వరకు టిప్పర్లు లాంటి భారీ వాహనాలు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అలా కాకుండా వీరి వాహనం సుమారు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌కు గుద్దుకుందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట టిప్పర్ లాక్కెళ్లినట్లు గుర్తులు ఏమైనా ఉన్నాయా? అని పరిశీలించారు. మృతురాలు ఎమ్మెల్యే కావడంతో.. రోడ్డు ప్రమాదంలో మరణించినది ఎమ్మెల్యే కావడంతో ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కేసు దర్యాప్తును అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తేల్చేందుకు పోలీసులు ఐదు శాఖలతో కూడిన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు, మోటార్‌వెహికిల్ (టాన్స్‌పోర్టు డిపార్టుమెంట్), సివిల్ ఇంజనీర్ (ఓఆర్ఆర్ ఇంజనీరింగ్ విభాగం), క్లూస్‌టీం, ఫోరెన్సిక్ డాక్టర్లు.. ఇలా ఐదు కీలక శాఖల నిపుణులతో ప్రత్యేక బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఆయా శాఖల నిపుణులు ఒకటీ రెండు రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. వాహనాన్ని పరిశీలించిన బృందం ప్రమాదానికి గురైన వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణుల బృందం లాస్యనందిత సీటు బెల్టు పెట్టుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. బెల్టు పెట్టుకుంటేనే బెలూన్లు ఓపెన్ అయ్యాయని చెబుతున్నారు. అయినా లాస్య తీవ్ర స్థాయిలో గాయాల పాలవడం.. ఏకంగా మృత్యువాత పడటం ఎలా జరిగిందనే కోణంలో కూడా నిపుణుల బృందం దర్యాప్తు చేస్తోంది. వీరి వాహనం కొత్తది కావడంతో ఫిట్నెస్ లోపాలు కూడా ఉండవనే నిర్దారణకు వచ్చారు. మలుపులు లేని రోడ్డు.. ఇంజనీరింగ్ విభాగం నిపుణులు ఔటర్‌రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అయితే ప్రమాదం జరిగిన చోట ఎలాంటి మలుపులు లేవని నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రదేశంలో ఎక్కడైనా సీసీటీవీ పుటేజీ దొరుకుతుందేమోనని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఒకటీ రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో తేల్చే అవకాశాలున్నట్లు పోలీసుశాఖ వర్గాలు చెబుతున్నాయి. హరీశ్‌రావు పరామర్శ పటాన్చెరు/ సంగారెడ్డి: లాస్య నందిత మృతి వార్త విని ఎమ్మెల్యే హరీష్‌రావు హుటాహుటిన పటాన్‌చెరుకు చేరుకున్నారు. అమేద ఆసుపత్రి వద్ద లాస్య కుటుంబ సభ్యులను, బంధువులను పరామర్శించారు. అలాగే లాస్య నందిత మృతి చెందడం పట్ల మంత్రి దామోదర రాజనర్సింహ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతోమంచి భవిష్యత్తు ఉన్న యువ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ఆమె మృతికి సంతాపం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
అయ్యో లాస్య..!
కంటోన్మెంట్/రసూల్‌పురా: 30 ఏళ్లుగా కంటోన్మెంట్‌తో విడదీయలేని బంధం ఏర్పరుచుకున్న దివంగత ఎమ్మెల్యే సాయన్న వారసురాలిగా లాస్య నందిత అనతికాలంలోనే రాజకీయాల్లో ప్రత్యేకత చాటుకున్నారు. 2016లో కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె ఐదేళ్ల పాటు సేవలందించారు. నాటి నుంచి కంటోన్మెంట్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా కొనసాగుతూ వచ్చారు. సోదరి నివేదితతో కలిసి తండ్రికి అండగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే సాయన్న తన తర్వాత లాస్యను ఎమ్మెల్యే చేయాలని తపించేవారు. అయితే, దురదృష్టవశాత్తూ గతేడాది సాయన్న తన పదవీకాలం ముగియక ముందే మరణించారు. సాధారణ ఎన్నికలు ఏడాదిలోపే గడువు ఉండటంతో ఉప ఎన్నికలు జరగలేదు. అయినప్పటికీ సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ లాస్యకు టికెట్ ఇవ్వడడంతో పోటీ చేసి గెలిచారు. సాయన్న టీమ్‌తో కలసిమెలసి.. దివంగత ఎమ్మెల్యే సాయన్న నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. లాస్య ఆయా వర్గాలను కలుస్తూ వారి మద్దతును కూడదీస్తూ గత ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించారు. ప్రజాసంఘాలు, కాలనీలు, బస్తీ సంక్షేమ సంఘాలతో ప్రత్యక్ష సంబంధాలు నెరుపుతూ వచ్చారు. ఆయా ప్రాంతాల్లోని సమస్యలపై దృష్టి సారిస్తూ దశల వారీగా పరిష్కారానికి చర్యలు చేపడుతూ వచ్చారు. ముఖ్యంగా తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. రెండునెలల్లోనే ప్రజాక్షేత్రంలోకి చొచ్చుకుపోతుండటంతో సాయన్న వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇంతలోనే లాస్య నందిత మృత్యువాత పడటంతో కార్యకర్తలను కలిచి వేసింది. లాస్య మృతి వార్త వెలువడగానే నియోజకవర్గ వ్యాప్తంగా సాయన్న, లాస్య అభిమానులు కార్ఖానాకు పోటెత్తారు. ఒకే ఒక్క బోర్డు సమావేశానికి హాజరు కంటోన్మెంట్ బోర్డులో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారు. లాస్య ఎమ్మెల్యేగా గెలిచిన రెండున్నర నెలల్లో రెండు బోర్డు సమావేశాలు జరిగాయి. గత నెలలో జరిగిన సమావేశానికి మాత్రమే ఆమె హాజరయ్యారు. అమ్ముగూడ రోడ్డుకు తన నియోజకవవర్గ అభివృద్ధి నిధుల్లో రూ.1 కోటి కేటాయిస్థానని హామీ ఇచ్చారు. గత బుధవారం బోర్డు కార్యాలయానికి వచి్చన ఆమె, బోర్‌వెల్స్ మీటర్లు పెట్టాలన్న బోర్డు ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలోనే లాస్య మృతి చెందడంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 2015లో రాజకీయ అరంగేట్రం.. దివంగత ఎమ్మెల్యే సాయన్న 1994 నుంచి వరుసగా మూడుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. 2009లో తొలిసారి ఓటమిపాలయ్యారు. తిరిగి 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఎనిమిది నెలల వ్యవధిలోనే 2015 జనవరిలో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి లాస్య నందితను రాజకీయ ఆరంగేట్రం చేయించారు. అయితే, ఈ ఎన్నికల్లో నళిని కిరణ్ చేతిలో లాస్య ఓటమి పాలయ్యారు. మరుసటి ఏడాది సాయన్న టీఆర్ఎస్లో చేరగా 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఇప్పించుకున్నారు. కాగా, 1986లో సాయన్న తొలిసారిగా కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమిపాలైన అదే ప్రాంతం(కవాడిగూడ) నుంచి 2015లో లాస్య గెలుపొందడం విశేషం. అయితే, 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోసారి కవాడిగూడ నుంచి పోటీ చేసి లాస్య ఓటమి పాలయ్యారు. తాజాగా 2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేసి గెలుపొందారు. అభివృద్ధి పనులపై దృష్టి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాయన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని వార్డుల్లో పవర్ బోర్‌వెల్స్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయన మరణంతో ఆయా పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈక్రమంలో ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య.. రసూల్‌పురా, ఇందిరమ్మనగర్, గన్ బజార్, మడ్ ఫోర్ట్, శ్రీరాంనగర్ డబుల్ బెడ్రూం గృహ సముదాయం, బోయిన్పల్లి తదితర ప్రాంతాల్లో పవర్‌బోర్లు వేయించారు. అదేవిధంగా బొల్లారంలో శిథిలావస్థలో ఉన్న జూనియర్ కళశాల భవనం స్థానంలో నూతన నిర్మాణానికి ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు పయనీర్ బజార్, ఆదర్శనగర్ బస్తీల్లో రోడ్లు, డ్రైనేజీ, పవర్ బోర్‌వెల్స్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదే విధంగా మడ్‌ఫోర్ట్ అంబేడ్కర్ హట్స్‌లో తాగునీటి పైపులైను పనులు పూర్తిలా చర్యలు తీసుకున్నారు. మడ్‌ఫోర్ట్ ప్రభుత్వ పాఠశాల్లో మన ఊరు మన బడి నిధులతో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. నారాయణ జోపిడి సంఘం డబుల్‌బెడ్ రూం ఇళ్లు త్వరగా పూర్తి అయ్యేలా రెవెన్యూ, గృహనిర్మాణ అధికారులను ఆదేశించారు. మార్చురీ వద్ద విషాదఛాయలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మార్చురీ వద్దకు చేరుకుని మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే లాస్య నందిత.. ఆమె తండ్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్నతో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే ఒంటిపై 12 తాయిత్తులు.. రెండుసార్లు ప్రాణాలతో బయటపడిన ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యువు మూడోసారి రోడ్డు ప్రమాద రూపంలో బలి తీసుకుంది. కంటోన్మెంట్లో ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవ సందర్భంగా లిఫ్ట్‌లో ఇరుక్కోవడం, ఇటీవల నల్లగొండ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు కిందపడి ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాస్య పలు ఆలయాలు, బాబాల వద్ద ప్రత్యేక పూజలు చేయించుకొని తాయిత్తులు కట్టించుకున్నట్టు తెలుస్తోంది. గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో మృతదేహంపై సుమారు 12 తాయిత్తులు ఉన్నట్టు వైద్యులు గుర్తించి పోలీసులకు అప్పగించినట్టు తెలిసింది. తలకు గాయం కావడంతో.. ప్రమాదంలో తలకు తీవ్రగాయం కావడంతోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందినట్టు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తెలిసింది. ప్రమాదంలో ఎడమకాలు విరిగిపోవడంతో పాటు దంతాలు ఊడిపోయాయి. గాంధీ ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ కృపాల్‌సింగ్, ప్రొఫె సర్ లావణ్య కౌషిల్ నేతృత్వంలో ఆరుగురు వైద్యబృందం పోస్టుమార్టం నిర్వహించారు. ఎమ్మెల్యేల నివాళి గాంధీ మార్చురీలో ఉన్న ఎమ్మెల్యే లాస్య మృతదేహానికి పలువురు ఎమ్మెల్యేలు నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు.గాంధీ ఆస్పత్రికి చేరుకున్న వారిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, వాకాటి శ్రీపతి, కోవా లక్ష్మీ, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్.. లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి తదితరులున్నారు. లాస్య అకాల మృతిపై సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. మంచి భవిష్యత్తు ఉన్న నాయకురాలు: మంత్రి కోమటిరెడ్డి బంగారు భవిష్యత్తు ఉన్న ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, ఇది అత్యంత బాధకరమైన విషయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గాంధీ మార్చురీ వద్ద లాస్య నందిత మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు ఆమె ఇచి్చన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్నతో తనకు 15 ఏళ్ల అనుబంధం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. -
లాస్య నందిత పోస్టుమార్టం నివేదిక.. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే..
హైదరాబాద్, సాక్షి: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం యావత్ రాష్ట్రాన్ని నివ్వెరపోయేలా చేసింది. పటాన్ చెరు ఓఆర్ఆర్పై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఆమె మృతదేహానికి జరిగిన పోస్టుమార్టం నివేదిక(ప్రాథమిక) బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడి అయ్యాయి. లాస్య తలకు బలమైన గాయాలు కావడంతోనే ఆమె స్పాట్లోనే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది. ‘‘తలకు బలమైన గాయాలు కావడం వల్లే అక్కడికక్కడే ఆమె చనిపోయారు. లాస్య నందిత శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. తై బోన్, రిబ్స్ ఫ్రాక్ఛర్ అయ్యాయి. ఆరు దంతాలు ఊడిపోయాయి. ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. మొత్తంగా.. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ఆమె మరణించారు’’ అని పోస్టుమార్టం నివేదికలో నిపుణులు పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగిసిన అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రావాల్సిన స్పష్టత లాస్య తప్ప ఆమె కుటుంబ సభ్యులు గురువారం రాత్రి సదాశివపేట (మం) కొనాపూర్‌లోని మిస్కిన్ బాబా దర్గాకి వచ్చారు. కాసేపటికే ఆకాష్‌తో పాటు లాస్య కూడా దర్గాకి వచ్చారు. లాస్య కుటుంబం అంతా రాత్రి 12.30 గంటలకు దర్గాలో పూజలు చేశారని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. తిరిగి.. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో హైదరాబాద్‌కు లాస్య కుటుంబం పయనం అయ్యింది. మొక్కులు తీర్చుకున్న తర్వాత.. 3 నుంచి 4 గంటల మధ్య లాస్య బయల్దేరిందని చెప్తున్నారు. అయితే.. పటాన్ చెరు వైపు ఎందుకు ఆమె వాహనం వెళ్లింది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదీ చదవండి: లాస్య నందితను వెంటాడిన మృత్యువు పూర్తిస్థాయి విచారణ తర్వాతే.. సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద కంటోన్మెంట్ ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైంది. ఘటనాస్థలాన్ని సంగారెడ్డి ఏఎస్పీ సంజీవ రావు, ఆర్టీఏ రామారావు పరిశీలించారు. ఏఎస్పీ సంజీవరావు మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 5:30 గంటలకు ప్రమాదం జరిగినట్టు పోలీసులకు సమాచారం అందింది. కారు శకలాలు 100 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి. అక్కడిక్కడే ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు. మరో వ్యక్తి ఆకాష్ మియపూర్ లో ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తాం అని అన్నారాయన. -
ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం
మేడ్చల్‌రూరల్: మేడ్చల్ పరిధిలోని ఓఆర్ఆర్పై అతివేగంతో వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎదురు లైన్లో వస్తున్న మరో కారును ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ ఎస్ఐ నవీన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వనస్థలిపురంనకు చెందిన రెడ్డప్ప రెడ్డి (50) ఉద్యోగ నిమిత్తం సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటినుంచి తన ఇన్నోవా కారులో బయలుదేరి బాచుపల్లిలో విధులు ముగించుకుని రాత్రి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలోని మేడ్చల్ ఎగ్జిట్ నెంబర్–6 సమీపంలోకి చేరుకున్నాడు. ఇదే సమయంలో ఎదురు లైన్లో వేగంగా వస్తున్న ఎక్స్‌యూవీ కారు అతివేగంతో వచ్చి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎదురులైన్‌లోకి దూసుకోచ్చి రెడ్డప్ప రెడ్డి ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. విషయం తెలుసుకున్న మేడ్చల్ సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ నవీన్‌రెడ్డి ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను కార్లలోంచి బయటికి తీశారు. ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న రెడ్డప్ప రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎక్స్‌యూవీ కారులో ఉన్న జగద్గిరిగుట్టకు చెందిన ముగ్గురిలో బీటెక్ విద్యార్థి రెడ్డి గణేశ్ (18) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో ఇద్దరు విద్యార్థులు మోక్షిత్‌రెడ్డి, మంగలపు గణేశ్‌లు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. -
కారులో బయలుదేరిన కొన్ని నిమిషాలకే.. విషాదం!
సాక్షి, సంగారెడ్డి/పటాన్చెరు: ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బీడీఎస్ సీఐ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ గోల్కొండకు చెందిన మహమ్మద్ సయిద్(20), నుమాన్ అలీ(19), హసీం, మజిద్, ఫైజల్ ఆహారం తీసుకునేందుకు కారులో శనివారం రాత్రి సంగారెడ్డి వైపు బయలుదేరారు. పటాన్చెరు మండలం కర్ధనూర్ ఓఆర్ఆర్ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో సయిద్, అలీ అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ముగ్గురికి తీవ్రగాయాలు కాగా చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో మజీద్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యులు ఆదివారం ఫిర్యాదు చేయగా కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: 'కుమురంభీం వర్ధంతి' వేడుకలో.. ఒక్కసారిగా విషాదం! -
డివైడర్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్: ముగ్గురి మృతి
పహాడీషరీఫ్: డీసీఎం వ్యాన్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు కూలీలు మార్బుల్స్ మధ్య నలిగిపోయి దుర్మరణం పాలయ్యారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. శంషాబాద్ నుంచి డీసీఎం వ్యాన్ (ఏపీ 28 టీఏ2410) కల్వకుర్తి వైపు మార్బుల్స్ లోడ్‌తో ఏడుగురు కార్మికులను ఎక్కించుకుని వెళుతోంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ రోడ్డు తుక్కుగూడ గ్రామం వద్దకు రాగానే డీసీఎం డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాహనాన్ని టోల్గేట్ డివైడర్‌కు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో షాపూర్ గ్రామానికి చెందిన రాములు(32), సాయిలు(40), కూకట్‌పల్లికి చెందిన శ్రీను(35)లు మార్బుల్స్ మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఎ.సంగయ్య(50), సత్యనారాయణ(48), పండరీ (32), ఎర్ర సాయిలు(40)కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఔ‘డర్’!
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై యాక్సిడెంట్లు నిత్యకృత్యమయ్యాయి. వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాలకు కారణం అతివేగమే అంటూ చేతులు దులుపుకొంటున్న హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ విభాగ అధికారులు... దీనికి కళ్లెం వేసేందుకు చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ప్రమాదాలు జరిగే 29ప్రాంతాలను గుర్తించినప్పటికీ కర్వ్‌లు, గ్రాండెంట్ సెక్షన్లు, ట్రాన్స్వర్స్ బార్ మార్కింగ్‌లు ఏర్పాటు చేయడం లేదు. ఓఆర్ఆర్ భద్రతపై రెండేళ్ల క్రితం సీఆర్ఆర్ఐ చేసిన ప్రతిపాదనలనూ గాలికొదిలేశారు. సాక్షి, సిటీబ్యూరో: అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో రోడ్డు ప్రమాదాలు జరిగితే చాలు...అతివేగమే కారణమంటూ చేతులు దులుపుకునే అధికారులు ఆ వేగానికి కళ్లెం వేసే చర్యలను మాత్రం ఆచరణ రూపంలోకి తీసుకరావడం లేదు. ‘ఎక్స్‌ప్రెస్‌వేపై డైరెక్షనల్ మార్కింగ్ స్పష్టంగా కనపడాలి...ఇంటర్‌ఛేంజ్‌లు, ర్యాంప్‌లు...మీడియం లేన్...సోల్డర్ లైన్...ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా వాహనాల వేగానికి కళ్లెం వేయవచ్చ’ని న్యూఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) రెండేళ్ల క్రితం సమర్పించిన ప్రతిపాదనలను అమలు చేయడంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఓఆర్ఆర్ విభాగ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అత్యధికంగా ప్రమాదాలు జరిగే 29 ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని అధ్యయనం చేయడం ద్వారా మెయిన్టెనెన్స్ లోపాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని చేసిన సూచనలను గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు ఓఆర్ఆర్ మార్గంలో లక్షా 40వేల వాహనాలు ప్రయాణిస్తున్నా భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్య ధోరణిపై విమర్శలు వస్తున్నాయి. వేగాన్ని నియంత్రించే ఏర్పాట్లపై శ్రద్ధ ఏదీ..? పెద్ద కారులు, చిన్న కారులు, లైట్ కమర్షియల్ వెహికల్స్, హెవీ ట్రక్కులు సీఆర్ఆర్ఐ అధ్యయనం చేసిన 29 ప్రాంతాల్లో పరిమితికి మించిన వేగంతో వెళుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నాయని గుర్తించింది. పెద్ద కారులు గంటలకు 108 నుంచి 127 కిలోమీటర్ల వేగం, చిన్నకార్లు 102 నుంచి 124 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతున్నట్టుగా రిపోర్టులో పేర్కోన్నారు. 50 శాతం పెద్ద కార్లు, 30 శాతం చిన్న కార్లు, ఏడు శాతం లైట్ కమర్షియల్ వెహికల్స్, ఒక శాతం భారీ ట్రక్కులు వేగంతో వెళుతున్నట్టుగా గుర్తించారు. ఈ పరిస్థితి వల్లనే డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాడు. ఈ ప్రాంతాల్లో కర్వ్‌లు, గ్రాండెంట్ సెక్షన్లు, ట్రాన్స్వర్స్ బార్ మార్కింగ్, మీడియన్ డెలినియోటర్స్‌తో కలిపి మీడియన్ మార్క్‌లు, స్పీడ్ అరెస్టర్స్ ఏర్పాటుచేయడం వల్ల వేగాన్ని నియంత్రించవచ్చని సీఆర్ఆర్ఐ ప్రతిపాదనలను ఆచరణ రూపంలోకి తీసుకురావడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ‘టిపికల్’ ప్రమాదాలపై నిర్లక్ష్యం... ఓఆర్ఆర్పై చాలా వాహనాలు మితిమీరిన వేగంతో అదుపుతప్పి స్తంభాలను ఢీకొట్టి అవతల ఉన్న సర్వీస్ రోడ్డుపై ఎగిరిపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే ఓఆర్ఆర్ అంతటా మెటల్ బీమ్ క్రాష్ బ్యారియర్ సరైన ఎత్తులో ఉండేలా చూసుకోవాలని, ఇవన్నీ ఒకేతీరున ఎత్తు తక్కువగా ఉండటం వల్ల వాహనాలు వాటిని గుద్ది అవతల ఎగిరిపడుతున్నాయని గుర్తించిన సీఆర్ఆర్ఐ ‘టిపికల్ డబుల్ మెటల్ బీమ్ క్రాష్ బ్యారియర్స్’ను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని స్పష్టం చేసినా ఆ పనుల్లో పురోగతి మాత్రం ఏమీ కనపడటం లేదు. అలాగే ఎక్స్ప్రెస్హైవేలో డైరెక్షనల్ మార్కింగ్‌లు వాహనదారులకు స్పష్టంగా కనబడేలా చర్యలను ఆశించిన రీతిలో తీసుకోలేదు. ‘రాత్రి సమయాల్లో వాహనదారుల భద్రత కోసం ఎడ్జ్ స్టడ్స్, లేన్ డివైడర్ స్టడ్స్ అవసరముంది. ఎక్స్‌ప్రెస్ వే కుడివైపు లేన్, మీడియన్ సైడ్‌ను తెలుపు రంగుతో మార్కింగ్ చేయాలి. అదేవిధంగా కుడివైపున రోడ్డు స్టడ్స్‌ను ఎరుపు రంగులో, మీడియన్ సైడ్ లేన్ పసుపు రంగులో మార్క్ చేయాలి. ఎక్స్‌ప్రెస్ వే హైస్పీడ్ వయోలేషన్స్ కుడివైపు, మీడియం లేన్లు రెడ్ కలర్ స్టడ్స్‌ను ఉపయోగించాలి. ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానం చేసే ర్యాంప్‌ల్లో చెవ్రాన మార్కింగ్ చేయడంతో పాటు బొల్లార్డ్స్‌ను ఉపయోగించాలి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాల్లో ‘నో స్టాపింగ్, నో పార్కింగ్, నో ఓవర్‌టేకింగ్ సైన్స్’ ఏర్పాటుచేయాలి. ఎగ్టిట్, ఎంట్రీ ప్రాంతాలవద్ద ఎనిమిది నుంచి పది మిల్లీమీటర్లు థింక్ పెయింట్‌ను రోడ్డు స్టడ్స్‌కు వేయాలి. వేగాన్ని నియంత్రించేందు బొల్లార్డ్స్ కూడా ఏర్పాటుచేయాల’ని సీఆర్ఆర్ఐ చెప్పినా అధికారులు మాత్రం తమకు ఏమీ అంటనట్టుగా వ్యవహరిస్తుండటంతో వాహనదారుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అవుటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం..
భీమవరం టౌన్/కాళ్ల: తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ అవుటర్ రింగు రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమవరానికి చెందిన ప్రముఖ ఆక్వా ఫీడ్ వ్యాపార వేత్త వేగేశ్న శ్రీరామరాజు అలియాస్ శ్రీరామ్ (30)మృతి చెందారు. కీసర నుంచి ఆయన కారులో వస్తుడంగా అవుటర్ రింగు రోడ్డు వద్ద డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కారు పల్టీ కొట్టింది. సంఘటనలో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. కారుపూర్తిగా దగ్ధమైంది. 108 వాహనంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆయన మృతిచెందారు. భీమవరం కాస్మో పాలిటన్ క్లబ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వేగేశ్న శ్రీరామరాజుకు భార్య మౌనికా శ్రీదేవి, ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ఆయన తండ్రి వేగేశ్న కృష్ణంరాజు కాళ్ల మండలం కోపల్లె గ్రామ ఉప సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు. గతంలో ఆయన ఆ గ్రామ సర్పంచ్‌గా కూడా సేవలందించారు. కృష్ణంరాజు పెద్ద కుమారుడు రవీంద్ర వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీరామరాజు అన్నయ్యను కలిసి ఆ తర్వాత పనులు చూసుకుని తిరిగి కారులో వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అందరితో సన్నిహితంగా ఉంటూ పదిమందికి సహాయపడే శ్రీరామరాజు మృతితో భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో విషాదం అలముకుంది. ఉండి మాజీ ఎమ్మెల్యేల పాతపాటి సర్రాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, డీఎన్నార్ కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, కలవపూడి సొసైటీ అధ్యక్షుడు మంతెన రాంబాబు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గాదిరాజు తాతరాజు, కౌన్సిలర్ సుబ్బరాజు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఓఆర్ఆర్పై ‘హెల్త్ ఎమర్జెన్సీ’ !
సాక్షి, హైదరాబాద్: వాహనదారుల అతివేగం వల్ల ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) రక్తసిక్తమవుతోంది. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓఆర్ఆర్లో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ రక్తపుటేర్లు పారుతూనే ఉన్నాయి. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ), సైబరాబాద్, రాచకొండ పోలీసులు తీసుకుంటున్న చర్యల వల్ల గతంలో కన్నా రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గినా.. ఆ ఘటన జరిగిన సమయంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణిస్తున్నవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్పై హెల్త్ ఎమర్జెన్సీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. ‘గోల్డెన్ అవర్’ కీలకం.. గోల్డెన్ అవర్.. అంటే ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంట(60 నిమిషాలు) సమయం. ప్రమాద తీవ్రతను బట్టి గోల్డెన్ అవర్ సమయం మారుతూ ఉంటుంది. ప్రమాదం జరిగి తీవ్రగాయాలైన సమయంలో క్షతగాత్రులను ‘గోల్డెన్ అవర్’లో ఆస్పత్రికి తీసుకురాకపొవడంతో అనేక మంది ప్రాణాలు వదులుతున్నారు. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్లో 2015లో 84 ప్రమాదాలు జరిగితే 81 మంది.. 2016లో 104 దుర్ఘటనలు జరిగితే 119 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఓఆర్ఆర్లో జరిగిన ప్రమాదాల్లో దాదాపు 50 మంది వరకు మృతి చెందారని రాచకొండ పోలీసులు చెబుతున్నారు. వాహనాల అతివేగం, డ్రైవర్ కునుకుపాట్లు తదితర కారణాల వల్ల జరిగిన ఈ ప్రమాదాల్లో గాయపడిన వారిని త్వరిగతిన ఆస్పత్రులకు చేరిస్తే ప్రాణాలు నిలిచేవని ఓఆర్ఆర్ నిర్వహణను చూసుకునే హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. క్షతగాత్రులకు ప్రాణం పోసే ‘గోల్డెన్ అవర్’లో ఆస్పత్రిలో చేర్చేలా పక్కా ప్రణాళిక రూపొందించారు. 20కిపైగా ఆస్పత్రులతో అవగాహన ప్రస్తుతం ఓఆర్ఆర్పై సంచరిస్తున్న ఎనిమిది అంబులెన్స్‌లకు తోడు మరిన్ని అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చి ఒక్కో అంబులెన్స్‌ను పది నుంచి 15 కిలోమీటర్ల మధ్య నిలిపి ఉంచేలా హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఫోన్‌కాల్ రాగానే ఆ ప్రాంతానికి ఐదు నిమిషాల వ్యవధిలో చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు రాంగ్రూట్లో వెళ్లేలా కూడా అనుమతివ్వనున్నారు. 108 ఫోన్‌కాల్ సెంటర్తోనూ చర్చలు జరిపిన అధికారులు.. వారికి ప్రమాద ఫోన్‌కాల్ రాగానే ఓఆర్ఆర్పై ఉన్న అంబులెన్స్‌లకు సమాచారం ఇచ్చేలా చర్చలు జరిపారు. అలాగే ఓఆర్ఆర్కు సమీపంలో ఉన్న దాదాపు 20కిపైగా ఆస్పత్రులతో ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన అధికారులు.. ప్రమాదంలో గాయపడిన వారిని అక్కడికి తీసుకెళ్లి చికిత్స కోసం అయ్యే ఖర్చును హెచ్ఎండీఏనే భరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఓఆర్ఆర్పై హెల్త్ ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
ఎంత ఘోరం
దీపావళి పండుగకు ముందే ఆ రెండు కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు.. మరో కుటుంబానికి చెందిన ఇద్దరి మరణంతో తీరని విషాదం నెలకొంది. విహారయాత్రకని వెళ్లిన ఆ ఐదుగురు విగతజీవులుగా మారడం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. షేర్‌మార్కెట్ వ్యాపారం.. ఆ ఐదుగురి ప్రాణాలమీదకు తెచ్చింది. ఈ సంఘటన మంగళవారం నార్సింగి మండలం కొల్లూరు వద్ద ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగింది. చేవెళ్ల/శంకర్పల్లి: శంకర్పల్లి మండలం మీర్జాగూడ అనుబంధ గ్రామం ఇంద్రారెడ్డినగర్ కాలనీ శివారులో మృతిచెందిన పటోళ్ల ప్రభాకర్‌రెడ్డి(31), మాధవి(27) వర్షిత్‌రెడ్డి(2.5), మృతుడి చిన్నమ్మ లక్ష్మి(42), ఆమె కూతురు సింధు(16)ల మరణాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. చనిపోయిన వారిలో ప్రభాకర్‌రెడ్డి, అతని భార్య మాధవి, కుమారుడు వర్షిత్‌రెడ్డిలు శంకర్పల్లి మండలం కొత్తపలి గ్రామానికి చెందిన వారు. ఉద్యోగం.. వ్యాపారంలో భాగంగా చిన్నమ్మ లక్ష్మి వద్దకు వెళ్లిన ప్రభాకర్‌రెడ్డి కుటుంబంతో పాటు చిన్నమ్మ, ఆమె కూతురు కూడా మృతి చెందటంతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. కుటుంబ నేపథ్యం శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల మహిపాల్‌రెడ్డి, సువర్ణలకు ఇద్దరు కుమారులు ఓ కూతురు ఉన్నారు. గ్రామంలో వీరికున్న 12 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ మహిపాల్‌రెడ్డి కొడుకులను చదివించాడు. వీరికి రెండు పౌల్ట్రీఫాంలు కూడా ఉన్నాయి. వీటిని మహిపాల్‌రెడ్డి, అతని చిన్న కొడుకు దయాకర్‌రెడ్డిలు చూసుకుంటున్నారు. పెద్దకొడుకు ప్రభాకర్‌రెడ్డి ఇంటర్ పూర్తయిన తర్వాత తన చిన్నమ్మ, చిన్నాన్న అయిన రవీందర్‌రెడ్డి, లక్ష్మీలు ఉండే లింగంపల్లి మండలం నల్లగండ్ల గ్రామానికి వెళ్లాడు. అక్కడే ఉంటే విద్యాభ్యాసం పూర్తిచేసి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2012లో మేడ్చల్ జిల్లా డి.పోచంపల్లి గ్రామానికి చెందిన మాధవితో వివాహం జరిగింది. వీరికి రెండున్నర సంవత్సరాల కుమారుడు (హర్షిత్) ఉన్నాడు. కుమారుడికి ఇటీవలే పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీరు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నారు. ప్రభాకర్‌రెడ్డి తాను చేస్తున్న ప్రైవేటు ఉద్యోగం మధ్యలోనే వదిలేసి రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లోకి దిగాడు. పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసినట్లు బంధువులు తెలిపారు. బంధువులు, సన్నిహితుల వద్ద డబ్బులు తీసుకొని పెట్టుబడులు పెట్టినట్లుగా సమాచారం. ఈ పెట్టుబడులు పెట్టిన డబ్బులు అప్పులుగా పెరిగిపోవటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఒత్తిడి పెరిగి ఉంటుందని అనుమానం వ్యక్తమవుతుంది. పామెనలోనూ విషాదం ప్రభాకర్‌రెడ్డి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియటంతో పామెన గ్రామం కూడా షాక్‌కు గురైంది. మృతుడు ప్రభాకర్‌రెడ్డి తల్లి సువర్ణ, చిన్నమ్మ లక్ష్మిల తల్లిదండ్రులది పామెన గ్రామం కావడంతో ఇక్కడి వారితో ప్రభాకర్‌రెడ్డి కుటుంబానికి మంచి పరిచయాలున్నాయి. మంచి పేరున్న వ్యక్తి కుటుంబం మృత్యువాత పడడాన్ని ఆ గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. అందరితో మంచిగా ఉండే వ్యక్తికి ఇలా జరిగిందంటే గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు. వివరాలు సేకరించిన క్లూస్ టీం మణికొండ: ఒకేసారి ఐదుగురు మరణించడంతో సైబరాబాద్ క్లూస్ టీం ప్రతినిధులు సంఘటన స్థలాల్లో దొరికిన ఆనవాళ్లను సేకరించారు. మహిళల మృతదేహాలను ఉన్నచోట ఎలాంటి వస్తువులు లభించకపోయినా కారులో మాత్రం వారు తాగిన కూల్‌డ్రింక్, నీటి బాటిళ్లు కనిపించాయి. వాటితో పాటు కారు ముందర రోడ్డుపై ఓ కేక్ బాక్సును వారు సేకరించారు. వాటితో పాటు కారుపై ఎవరివైనా వేలిముద్రలు ఉన్నాయా అనే కోణంలోనూ ఆనవాళ్లను సేకరించారు. పోలీసు జాగిలాలను రప్పించారు. సంఘటనా స్థలాన్ని సైబరాబాద్ సీపీ సందీప్శాండిల్లా, మాదాపూర్ ఏసీపీ విశ్వనాథ్, ఏసీపీ రమణకుమార్, నార్సింగి సీఐ రమణగౌడ్లు సందర్శించి ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకున్నారు. వివరాల సేకరణ అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం బంధువులకు అప్పగించారు. తరలివచ్చిన జనం.. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ శివారులో ఐదు మృతదేహాలు లభించాయనే విషయం తెలుసుకొని అటు సంగారెడ్డి, ఇటు గండిపేట మండలాల ప్రజలు సంఘటనా స్థలానికి భారీగా తరలివచ్చారు. దీంతో ఔటర్ రింగ్‌రోడ్డు, సర్వీసు రోడ్డు ప్రజలతో పాటు మీడియా, పోలీసు వాహనాలతో ప్రజలతో కిక్కిరిసింది. రెండేళ్ల వర్షిత్ మృతితో తల్లడిల్లిన బంధువులు.. పటాన్చెరు : కొల్లూరు శివారులో (నార్సింగి పీఎస్ పరిధిలో) ఓఆర్ఆర్ కింద కారులో తండ్రి ప్రభాకర్‌రెడ్డి పక్కన కారులో మృతి చెందిన రెండేళ్ల వర్షిత్‌ను చూసిన ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోయారు. ప్రభాకర్‌రెడ్డి బంధువులు ఆ సన్నివేశాన్ని చూసి రోదించారు. ముఖ్యంగా మహిళా కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. చిన్నారిని చూస్తూ వారు పడుతున్న ఆవేదనతో అక్కడున్న వారి హృదయం ద్రవించిపోయింది. అభం శుభం తెలియని చిన్నారి మృతికి కారణం ఎవరనే ప్రశ్న మానవతావాదులందరినీ వేధించింది. ఒకవేళ తండ్రి ప్రభాకర్‌రెడ్డే తన కుమారుడికి విషం ఇచ్చి ఉంటే అంత దారుణానికి ఆయన ఎందుకు ఒడిగడతారని అక్కడున్న వారు చర్చించుకోవడం కనిపించింది. చంపడం.. తెచ్చిపడేయడం.. అమీన్పూర్ మాత్రమే కాకుండా ఔటర్ రింగ్‌రోడ్డు ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్‌లో ఏదో మూల జరిగిన హత్యలకు సంబంధించిన మృతదేహాలను పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో దుండగులు తెచ్చిపడేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఓఆర్ఆర్పై ఓ మహిళ శవం కనిపించింది. అది ప్రమాదమా, హత్య చేసి ఇక్కడ పడేశారా అనేది తెలియరాలేదు. సుల్తాన్పూర్ గుట్టల్లో ఓ యువకుడిని హత్య చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు సర్వీసు రోడ్డు పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా ఉండడంతో మహానగరంలోని కొందరు తమ నేరాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ ప్రాంతంలో మృత దేహాలను తెచ్చి పడేస్తున్నారని భావిస్తున్నారు. భూమి కొనుగోలుతోనే సమస్యంతా... మణికొండ: ఐదుగురు మృతుల్లో ఒకరైన ప్రభాకర్‌రెడ్డి ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఓ భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. దీనికోసం కోటిరూపాయలకు పైగా అప్పులు తెచ్చినట్లు సమాచారం. అయితే ఆ భూమి ప్రభుత్వ భూమిగా తేలటంతో తీవ్ర ఇబ్బందులకు గురయినట్లు అతడి మిత్రులు తెలిపారు. షేర్మార్కెట్లో పెట్టుబడులు, ఇతర అప్పులు పెరిగిపోవడం, బాకీలు తీర్చాలని బంధువులు, స్నేహితులు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు మిత్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శోకసంద్రంలో పూడూరు పూడూరు(పరిగి): పూడూరు మండల కేంద్రానికి చెందిన కొండాపురం రవీందర్‌రెడ్డి, లక్ష్మి(40) దంపతులు. వీరు కొన్నేళ్ల క్రితం తమ కుమారుడు దినేష్‌రెడ్డి, కూతురు సింధూజ(16)తో కలిసి సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరువు మండలం బీరంగూడకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రవీందర్‌రెడ్డి రుద్రారంలోని ఐటీడబ్ల్యూ కంపెనీలో ఆపరేటర్‌గా పనిచేస్తూ స్థానికంగా ఇళ్లు నిర్మిస్తూ విక్రయిస్తూ బిల్డర్‌గా పనిచేస్తున్నాడు. కూతురు సింధూజ ఇంటర్ చదువుతుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లికి చెందిన ప్రభాకర్‌రెడ్డి(32) లక్ష్మికి స్వయాన అక్కకొడుకు. ఇతను తన భార్య మాధవి(28), కుమారుడు వశిష్ట్‌రెడ్డి(రెండున్నరేళ్లు)తో కలిసి దంపతులు బీరంగూడ సమీపంలోని అశోక్‌నగర్‌లో నివసిస్తున్నాడు. వీరి కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్తుంటారు. ప్రభాకర్‌రెడ్డి షేర్ మార్కెట్ బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ప్రభాకర్‌రెడ్డి కుటుంబం లక్ష్మి ఇంటికి వచ్చింది. సెలవు కావడంతో డిండి ప్రాజెక్టుకు వెళ్తున్నట్లు చెప్పిన ప్రభాకర్‌రెడ్డి తన పిన్ని లక్ష్మి, సోదరి సింధూజను తీసుకెళ్లి బాబాయి రవీందర్‌రెడ్డి కారులో వెళ్లాడు. సాయంత్రం రవీందర్‌రెడ్డి తన భార్యకు ఫోన్ చేయగా డిండి ప్రాజెక్టు నుంచి బయలుదేరినట్లు చెప్పింది. అనంతరం రాత్రి 8గంటలకు ఆయన మరోసారి ఫోన్‌చేయగా నాట్‌రీచబుల్ వచ్చింది. ఆందోళనకు గురైన రవీందర్‌రెడ్డి కారులో వెళ్లిన మిగతా వారికి ఫోన్ చేయగా స్విఛాఫ్ సమాధానం వచ్చింది. దీంతో ఆయన ఆందోళనకు గురయ్యాడు. ఆయన అనుమానం వచ్చి వెంటనే 100కు కాల్ చేసి విషయం చెప్పాడు. మంగళవారం ఉదయం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిండి ప్రాజెక్టుకు వెళ్తున్నామని కుటుంబీకులకు చెప్పడంతో మొదట రవీందర్‌రెడ్డి ఆ ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి గాలించసాగాడు. మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా నార్సింగి ఠాణా పరిధిలోని కొల్లూరు శివారులో గుర్తు తెలియని ఐదుగురి మృతదేహాలు పడి ఉండడంతో పోలీసులు రవీందర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన వారిని గుర్తించి బోరుమన్నారు. -
మంత్రి తలసాని కారును ఢీకొట్టిన లారీ
-
తలసానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
కీసర: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో నిర్మించనున్న మేడ్చల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. అనంతరం కీసరలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రథమ వార్షిక వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. శామీర్‌పేట జంక్షన్ వద్ద మంత్రి కాన్వాయ్‌తోసహా రింగ్‌రోడ్డు ఎక్కారు. నర్సంపల్లి – యాద్గార్పల్లి మధ్య ముఖం కడుక్కునేందుకు కారును పక్కకు ఆపమని మంత్రి చెప్పడంతో డ్రైవర్ వాహనాన్ని ఎడమవైపునకు తీసుకున్నాడు. ఇంతలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ మంత్రి కారును ఢీకొంది. దీంతో మంత్రి కూర్చున్న కారు కొద్దిగా ముందుకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు తలసానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారు వెనుక భాగం మాత్రం దెబ్బతిన్నది. అయితే వెనుక సీటులో కూర్చున్న మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఎంపీ చామకూర మల్లారెడ్డి కూడా మంత్రికారులోనే ఉన్నా, ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. మంత్రి కారును ఢీకొట్టిన లారీని కీసర పోలీస్‌స్టేషన్‌కు తరలించి, డ్రైవర్ రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు కీసర సీఐ సురేందర్‌గౌడ్ తెలిపారు. దేవుడి దయతోనే బయటపడ్డా: తలసాని సాక్షి, హైదరాబాద్: దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతోనే లారీ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ ప్రమాద విషయం తెలుసుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోన్ చేసి పరామర్శించారని ఈ సందర్భంగా చెప్పారు. -
హీరో రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం
ఓఆర్ఆర్పై కొత్వాల్‌గూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్)పై కొత్వాల్‌గూడ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు, నటుడు భరత్‌రాజ్(50) దుర్మరణం చెందారు. మితిమీరిన వేగంతో ప్రయాణించిన ఆయన కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో చనిపోయిన భరత్.. రవితేజ సోదరుడని గుర్తించడానికి కొంత సమయం పట్టింది. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించగలిగారు. భరత్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు అనుమానిస్తున్నప్పటికీ.. పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప నిర్థారించలేమని పోలీసులు చెప్తున్నారు. భరత్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నేరుగా జూబ్లీహిల్స్ రోడ్డులోని మహా ప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. నోవాటెల్ నుంచి వస్తుండగా ప్రమాదం వివాహితుడైన భరత్‌రాజ్ భార్య అమెరికాలో నివసిస్తుండగా.. ఆయన ప్రస్తుతం మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భరత్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్‌కు వెళ్లినట్లు అక్కడి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రాత్రి 9.20 గంటల సమయంలో భరత్ హోటల్ నుంచి ఒంటరిగా తన స్కోడా ఒక్టావికా కారు(టీఎస్09ఈసీ0799)లో ఇంటికి బయలుదేరినట్లు భావిస్తున్నారు. హోటల్ నుంచి దాదాపు 20–25 నిమిషాల ప్రయాణం తర్వాత ఆయన డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టి.. ఓఆర్ఆర్పై శంషాబాద్ వైపు నుంచి గచ్చిబౌలివైపు లోడ్‌తో వెళ్తున్న లారీ గురువారం మరమ్మతులకు లోనైంది. దాని ఇంజన్ ఫెయిల్ కావడంతో వాహనాన్ని క్యారేజ్ వేలో ఉంచారు. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ బాధ్యతలు నిర్వర్తించే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం లారీ(ఏపీ16టీవై3167) బ్రేక్‌డౌన్ అయిన విషయం గుర్తించారు. లారీకి వెనుక వైపు 30 మీటర్ల దూరంలో రిఫ్లెక్టివ్ క్రోన్స్ ఏర్పాటు చేసి, వాటిని అనుసంధానిస్తూ రిఫ్లెక్టివ్ టేప్ సైతం కట్టారు. ఆ ప్రాంతంలో లైటింగ్ కూడా స్పష్టంగా ఉంది. శనివారం రాత్రి 9.45–10 గంటల మధ్య మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన భరత్ వాహనం క్రోన్స్‌ను గుద్దుకుంటూ ముందుకెళ్లి లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీ కొంది. రవితేజ సోదరుడిగా ఆదివారం గుర్తింపు.. ప్రమాదం విషయం తెలుసుకున్న ఆర్జీఐఏ పోలీసుస్టేషన్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని.. అతికష్టమ్మీద కారును లారీ కింది నుంచి బయటకు లాగారు. ఆపై అందులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. అతడి వద్ద లభ్యమైన ఆధార్ కార్డును బట్టి చనిపోయిన వ్యక్తి భరత్ రాజ్‌గా గుర్తించారు. కారులో లభ్యమైన ఫోన్లోని కొన్ని నంబర్లకు పోలీసులు డయల్ చేసినప్పటికీ స్పందన రాలేదు. ఓ నంబర్‌కు కాల్ చేసి ప్రమాద విషయం తెలుపగా.. ‘ఆస్పత్రికి తీసుకువెళ్లండి’అంటూ సమాధానం వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆదివారం ఉదయం రవితేజ మరో సోదరుడు రఘు పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో చనిపోయింది రవితేజ మరో సోదరుడు భరత్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కారు ఆయన తల్లి భూపతిరాజు రాజ్యలక్ష్మి పేరుతో రిజిస్టరై ఉంది. గత ఏడాది ఆగస్టు, ఈ ఏడాది ఏప్రిల్ నెలల్లో రాంగ్ పార్కింగ్ చేసినందుకు దీనిపై రెండు ఈ–చలాన్లు(రూ.370) జారీ అయి పెండింగ్‌లో ఉన్నాయి. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించిన అనంతరం సంబంధీకులకు అప్పగించారు. అక్కడ నుంచి నేరుగా విష్ఫర్వ్యాలీలోని మహా ప్రస్థానానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆది నుంచీ వివాదాస్పదుడే.. ఆది నుంచీ వివాదాస్పదుడైన భరత్ మంచి క్రికెట్ ప్లేయర్. సినీ తారల మ్యాచ్‌లు జరిగినప్పుడల్లా వాటిలో పాల్గొనేవాడు. భరత్‌పై గతంలో మాదకద్రవ్యాలు, పోలీసులతో దురుసు ప్రవర్తన కేసులు సైతం నమోదయ్యాయి. సోదరుడు రవితేజ నటించిన కొన్ని సినిమాలతో పాటు పలు చిత్రాల్లో సహాయ నటుడిగా.. ప్రతినాయకునిగా భరత్ నటించాడు. దూకుడు, ఆగడు, అతడే ఒక సైన్యం, పెదబాబు, 143, నేనింతే తదితర చిత్రాల్లో పాత్రలు పోషించాడు. అతివేగమే ప్రాణం తీసిందా..? కారు ముందు టైరు.. లారీ వెనుక టైరుకు ఢీ కొనే వరకు కారు చొచ్చుకుపోయి నుజ్జునుజ్జయ్యింది. ఆ సమయంలో కారు గంటకు 145 కి.మీ. వేగంతో దూసుకెళ్లినట్లు లాక్ అయిన స్పీడో మీటర్ స్పష్టం చేస్తోంది. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచు కున్నప్పటికీ కారు లారీ కిందికి దూసుకు పోవడంతో అవి భరత్ ప్రాణాలు కాపాడలేకపోయాయి. కారులో సగం ఖాళీ అయిన ఓడ్కా బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద సమయంలో భరత్ మద్యం మత్తులో ఉన్నాడా? లేదా? అనేది పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే చెప్పగలమని పోలీసులు అంటున్నారు. మితిమీరిన వేగంతో కారులో వస్తున్న భరత్ ఆగి ఉన్న లారీని గుర్తించి ఉండడని పోలీసులు చెప్తున్నారు. ఆ ప్రాంతంలో కారుకు బ్రేక్ వేసినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియలకు హాజరుకాని రవితేజ భరత్ అంత్యక్రియలను రవితేజ మరో సోదరుడు రఘు, బాబాయ్ మూర్తి రాజు పూర్తి చేశారు. రవితేజతో పాటు కుటుంబ సభ్యులెవరూ అంత్యక్రియలకు హాజరుకాలేదు. అయితే ప్రమాదంలో నుజ్జునుజ్జయిన తమ్ముడి మృత దేహాన్ని తాను చూసి తట్టుకోలేనని, అందుకే అంత్యక్రియలకు వెళ్లలేనని, తమ కుటుంబ సభ్యుల పరిస్థితి అర్థం చేసుకోవాలని రవితేజ తన సన్నిహిత వర్గాల వద్ద వాపోయినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగు తోంది. కాగా, భరత్ అంత్యక్రియలకు జీవితా రాజ శేఖర్, అలీ, ఉత్తేజ్, రఘుబాబు హాజరయ్యారు. -
రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం.. పూర్తివివరాలు
- ఔటర్ ప్రమాదంలో స్పాట్‌డెడ్.. మృతదేహం గుర్తింపు ప్రక్రియ ఆలస్యం - ఉస్మానియా మార్చురీ నుంచి నేరుగా అంత్యక్రియలకు - అమెరికాలో భరత్ సతీమణి.. పిల్లలు లేరు - పోస్ట్‌మార్టం రిపోర్టులు వస్తే మిగతా విషయాలు తేలతాయన్న డీసీపీ సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్‌పై (ఓఆర్ఆర్) కొత్వాల్‌గూడ వద్ద శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు, నటుడు భూపతి భరత్ రాజ్ (50) దుర్మరణం చెందారు. మితిమీరిన వేగంతో వచ్చిన ఆయన కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో చనిపోయిన భరత్ సినీ హీరో రవితేజ సోదరుడని గుర్తించడానికీ చాలా సమయం పట్టింది. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించగలిగారు. భరత్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు అనుమానిస్తున్నప్పటికీ... పోస్టుమార్టం పరీక్షల రిపోర్ట్ వస్తే తప్ప నిర్థారించలేమని పోలీసులు చెప్తున్నారు. భరత్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నేరుగా మహా ప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. వివాహితుడైన భరత్ రాజ్ భార్య అమెరికాలో నివసిస్తుండగా... ఆయన ప్రస్తుతం మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వీరికి సంతానం లేరు. శనివారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల ప్రాంతంలో భరత్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్‌కు వెళ్ళారు. ఈ మేరకు అక్కడి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చాలా సేపటి వరకు అక్కడి గదిలో ఉన్న భరత్ రాత్రి 9.20 గంటల సమయంలో హోటల్ నుంచి ఒంటరిగా తన స్కోడా ఒక్టావికా కారులో (టీఎస్ 09 ఈసీ 0799) ఇంటికి బయలుదేరినట్లు భావిస్తున్నారు. హోటల్ నుంచి దాదాపు 20–25 నిమిషాల ప్రయాణం తర్వాత ఆయన డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. భరత్ నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. రిఫ్లెక్టివ్ క్రోన్స్‌ను దాటి లారీని ఢీ కొట్టి... ఓఆర్ఆర్పై శంషాబాద్ వైపు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న లోడ్‌తో కూడిన లారీ గురువారం మరమ్మతులకు లోనైంది. దాని ఇంజన్ ఫెయిల్ కావడంతో వాహనాన్ని క్యారేజ్ వేలో ఉంచారు. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ బాధ్యతలు నిర్వర్తించే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం ఈ లారీ (ఏపీ 16 టీవై 3167) బ్రేక్‌డౌన్ అయిన విషయం గుర్తించారు. లారీకి వెనుక వైపు 30 మీటర్ల దూరంలో రిఫ్లెక్టివ్ క్రోన్స్ ఏర్పాటు చేసి, వాటిని అనుసంధానిస్తూ రిఫ్లెక్టివ్ టేప్ సైతం కట్టారు. ఆ ప్రాంతంలో లైటింగ్ కూడా స్పష్టంగా ఉంది. శనివారం రాత్రి 9.45–10 గంటల మధ్య మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన భరత్ రాజ్ వాహనం క్రోన్స్‌ను గుద్దుకుంటూ ముందుకు వెళ్ళి లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదం ధాటికి కారు దాదాపు సగం వరకు లారీ కిందికి చొచ్చుకుపోయి నజ్జునుజ్జయింది. కారు ముందు టైరు... లారీ వెనుక టైరుకు ఢీ కొనే వరకు కారు చొచ్చుకుపోయింది. ఆ సమయంలో కారు గంటకు 145 కిమీ వేగంతో దూసుకువచ్చినట్లు లాక్ అయిన స్పీడో మీటర్ స్పష్టం చేస్తోంది. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ కారు లారీ కిందికి దూసుకుకోవడంతో అవి ప్రాణాలు కాపాడలేకపోయాయి. కారులో సగం ఖాళీ అయిన ఓడ్కా బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద సమయంలో భరత్ మద్యం మత్తులో ఉన్నాడా? లేదా? అనేది పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలమని పోలీసులు అంటున్నారు. మితిమీరిన వేగంతో ఉన్న భరత్ ఆగి ఉన్న లారీని గుర్తించి ఉండడని పోలీసులు చెప్తున్నారు. ఆ ప్రాంతంలో కారుకు బ్రేక్ వేసినట్లు ఎలాంటి ఆనవాళ్ళు లేకపోవడంతో ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ఫోన్.. ఆస్పత్రికి తీసుకెళ్లండని సమాధానం! ప్రమాదం విషయం తెలుసుకున్న ఆర్జీఐఏ పోలీసుస్టేషన్ అధికారులు ఘటనాస్థలికి వచ్చారు. అతికష్టమ్మీద కారును లారీ కింది నుంచి బయటకు లాగారు. ఆపై అందులో ఉన్న భరత్ మృతదేహాన్ని బయటకు తీశారు. అతడి వద్ద లభ్యమైన ఆధార్ కార్డును బట్టి చనిపోయిన వ్యక్తి భూపతి భరత్ రాజ్‌గా గుర్తించారు. కారులో లభ్యమైన ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు కొన్ని నెంబర్లకు డయల్ చేసినప్పటికీ స్పందన రాలేదు. ఓ నెంబర్‌కు కాల్ చేసి ప్రమాద విషయం తెలుపగా... ‘ఆస్పత్రికి తీసుకువెళ్ళండి’ అంటూ సమాధానం వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆదివారం ఉదయం రవితేజ మరో సోదరుడు రఘు పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో చనిపోయింది రవితేజ మరో సోదరుడు భరత్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కారు ఆయన తల్లి భూపతిరాజు రాజ్యలక్ష్మి పేరుతో రిజిస్టరై ఉంది. గత ఏడాది ఆగస్టు, ఈ ఏడాది ఏప్రిల్ నెలల్లో దీనిపై రెండు ఈ–చలాన్లు (రూ.370) జారీ అయి పెండింగ్‌లో ఉన్నాయి. సాగర్ సొసైటీ, అన్నపూర్ణ చౌరస్తాల్లోని క్యారేజ్ వేల్లో రాంగ్ పార్కింగ్ చేసినందుకు బంజారాహిల్స్, శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు వీటిని జారీ చేశారు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించిన అనంతరం సంబంధీకులకు అప్పగించారు. అక్కడ నుంచి నేరుగా విష్ఫర్వ్యాలీలోని మహా ప్రస్థానానికి తీసుకువెళ్ళి అంత్యక్రియలు నిర్వహించారు. ఆది నుంచీ వివాదాస్పదుడైన భరత్ మంచి క్రికెట్ ప్లేయర్. సినీ తారల మ్యాచ్‌లు జరిగినప్పుడల్లా వాటిలో పాల్గొనేవాడు. అతడు మంచి బౌలర్ అయి పలువురు చెప్తున్నారు. భరత్‌పై గతంలో మాదకద్రవ్యాలు, పోలీసులతో దురుసు ప్రవర్తన కేసులు సైతం నమోదయ్యాయి.