విజయవాడ ప్రజలకు తొలిసారిగా ఎయిర్ షో కనువిందు చేయనుంది.
విజయవాడ : విజయవాడ ప్రజలకు తొలిసారిగా ఎయిర్ షో కనువిందు చేయనుంది. జనవరి 12 నుంచి మూడు రోజులపాటు జరిగే ఎయిర్ షో ఏర్పాట్లకు సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షసమా వేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిలో తొలిసారిగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి 12న గేట్‌వే హోటల్‌లో నిర్వహించే సమ్మిట్‌కు 500 మందికి పైగా డెలిగేట్లు హాజరవుతారని తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు ఈ సమ్మిట్‌ను ప్రారంభిస్తారని, సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరవుతారని కలెక్టర్ చెప్పారు.