ఎయిర్ షోలో కుప్పకూలిన విమానం | Plane crashes at Shoreham Air Show, caused several casualties | Sakshi
Sakshi News home page

ఎయిర్ షోలో కుప్పకూలిన విమానం

Published Sat, Aug 22 2015 8:29 PM | Last Updated on Sat, Jun 30 2018 4:20 PM

విమానం కూలిన ప్రాంతంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు - Sakshi

విమానం కూలిన ప్రాంతంలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు

వైమానిక ప్రదర్శనలో భాగంగా ఆకాశంలో చక్కర్లు కొడుతున్న విమానం.. ఒక్కసారిగా నేలకూలింది. ప్రదర్శన జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోని ఇళ్లపై పడిపోయింది. పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు, పొగ ఎగిసిపడ్డాయి.

 

ఇంగ్లాండ్లోని బ్రిడ్జ్టన్ ఎయిర్పోర్టులో శనివారం స్థానిక కాలమానం ప్రకారం మద్యాహ్నం 1:30కు ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, ప్రాణ, ఆస్తినష్టం వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని అత్యవసర సిబ్బంది పేర్కొన్నారు. కాగా, ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.

ఇంగ్లాండ్ తూర్పు తీరంలోని బ్రిడ్జ్టన్ ఎయిర్పోర్టులో జరుగుతున్న ఎయిర్ షోలో.. ఏ 27 అనే సింగిల్ సీటర్ జెట్ ఫైటర్ విన్యాసాలు ప్రదర్శించింది. చివరి లూప్ను పూర్తి చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి నేలకూలిందని, ఎయిర్పోర్టుకు సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో అది కూలిపోయిందని, ఆ స్థలానికి సమీపంలో ఇళ్లు కూడా ఉన్నాయని సహాయక బృందం ప్రతినిధులు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement