చెన్నై: డీఎంకే లోక్‌సభ ఎంపీ జగత్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ. 89.19 కోట్ల ఆస్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. ఫెమా నిబంధనలను ఎంపీ ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడీ కేసు దర్యాప్తు చేపట్టింది. ఈడీ అటాచ్ చేసిన వాటిలో వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇళ్ళు వంటి స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలలో బ్యాలెన్స్ మొత్తంగా రూ .89.19 కోట్ల వాటాలను స్వాధీనం చేసుకుంది. ఎంపీ జగత్రక్షకన్ తమిళనాడులోని అరక్కోణం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2017 లో జగత్రక్షకన్, ఆయన కుమారుడు సందీప్ ఆనంద్ 90 లక్షల షేర్లను సింగపూర్‌లోని మెసర్స్ సిల్వర్ పార్క్ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి కొనుగోలు చేశారని.. అయితే ఇందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోలేదని వెల్లడైంది.
ఫెమా 37ఏ నిబంధనల ప్రకారం భారతదేశం వెలుపల ఉన్న విదేశీ మారకద్రవ్యం, విదేశీ భద్రత, స్థిరమైన ఆస్థి ఫెమాలోని సెక్షన్ 4కు విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ మొత్తం విలువకు సమానమైన ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ఈడీకి ఉంది. దీనికి అనుగుణంగలా తమిళనాడులోని వ్యవసాయ భూములు, స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలలో బ్యాలెన్స్ రూపంలో జగత్రక్షకన్, అతని కుటుంబ సభ్యులనుంచి రూ. 89.19 కోట్ల విలువైన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఫెమా సెక్షన్ 37ఏ నిబంధనల ప్రకారం ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగనుంది. (‘అమ్మా, అప్పా.. అలసిపోయా.. క్షమించండి’)
Comments
Please login to add a commentAdd a comment