అదే టార్గెట్‌, త్వరలో 10,000 మంది టీచర్లను నియమించుకుంటాం: బైజూస్‌ | India Byjus Targets Profitability By March 2023 | Sakshi
Sakshi News home page

అదే టార్గెట్‌, త్వరలో 10,000 మంది టీచర్లను నియమించుకుంటాం: బైజూస్‌

Oct 13 2022 2:43 PM | Updated on Oct 13 2022 3:00 PM

India Byjus Targets Profitability By March 2023 - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి లాభాల్లోకి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌ వెల్లడించింది. 2020– 21లో కంపెనీ రూ.2,428 కోట్ల టర్నోవర్‌పై రూ.4,588 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.


2021– 22లో రూ.10,000 కోట్ల టర్నోవర్‌ సాధించింది. అయితే లాభం/నష్టాన్ని మాత్రం వెల్లడించలేదు. వచ్చే ఆరు నెలల్లో 2,500 మంది ఉద్యోగులను తీసివేస్తున్నట్టు బైజూస్‌ కో–ఫౌండర్‌ దివ్య గోకుల్‌నాథ్‌ తెలిపారు. అలాగే భారత్‌తోపాటు విదేశీ మార్కెట్ల కోసం 10,000 మంది టీచర్లను నియమించుకోనున్నట్టు పేర్కొన్నారు. ‘వీరిలో సగం మందిని భారత్‌ నుంచి ఎంచుకుంటాం.



ఇంగ్లీష్, స్పానిష్‌ మాట్లాడే వారికి అవకాశాలు ఉంటాయి. టీచర్లను భారత్, యూఎస్‌ నుంచి ఎంపిక చేస్తాం’ అని వివరించారు. ప్రస్తుతం కంపెనీలో 50,000 మంది పనిచేస్తున్నారు.

చదవండి: యూజర్లకు బంపరాఫర్‌.. రూ.10కే మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement