ఇటీవల టెక్ కంపెనీలతో పాటు స్టార్టప్‌లు కూడా పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు కనిపిస్తోంది. దేశంలో ప్రముఖ సంస్థల నుంచి చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు సైతం భారీగా తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. తాజాగా ప్రముఖ ఆన్‌లైన్ లెర్నింగ్ దిగ్గజం బైజూస్ కూడా భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కొత విధించేందుకు సిద్ధమైంది.
ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ సంస్థలోనూ కోతల పరంపర కొనసాగతోంది. ఇటీవల ఆలస్యంగా జరిపిన ఆడిట్ తర్వాత ఖర్చను తగ్గించుకోవాలని బైజూస్ భావిస్తోంది. ఈ క్రమంలో కంపెనీలో దాదాపు 5% ఉద్యోగులను తీసివేయాలిని నిర్ణయించుకుంది. ప్రాడెక్ట్, కంటెంట్, మీడియా, టెక్నాలజీ సాంకేతికత వంటి విభాగాలలో దశలవారీగా ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిపింది. దేశంలోని విద్యాసంస్థల్లో తరగతులు ప్రారంభం కావడంతో, ఆన్‌లైన్ బోధన జరిపే ఎడ్‌టెక్ సంస్థలకు ఆదరణ తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది.
దీని వల్ల దాదాపు 2,500 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇప్పటికీ వరకు బైజూస్ ఈ స్థాయిలో తొలగింపులలో జరగలేదు. మీషో, కార్స్ 24, అనాకాడెమీతో సహా ఇతర స్టార్టప్‌లు ప్రపంచవ్యాప్తంగా మందగమనం, ఇన్వెస్టర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడి మధ్య కేపిటల్ ధనాన్ని ఆదా చేయడంతో పాటు పొదుపు మంత్రాన్ని పాటిస్తూ వర్క్‌ఫోర్స్‌ను తగ్గిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: దీపావళి షాపింగ్: ఈ స్పెషల్ ఆఫర్స్ తెలుసుకుంటే బోలెడు డబ్బు ఆదా!
Comments
Please login to add a commentAdd a comment