
సాక్షి,ముంబై: ఎడ్యు టెక్ యునికార్న్ బైజూస్ మరోసారి ఉద్యోగుల కోతకు నిర్ణయించింది. దాదాపు 15 శాతం మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించింది. దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తోందని కంపెనీలో ఇంజనీరింగ్ టీమ్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ బిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది.
ఇప్పటికే గత ఏడాది అక్టోబర్ లో ఇప్పటికే 2500 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా బైజూస్ మరో 1000 మందికి ఉద్వాసన పలికింది. ఇందులో ఎక్కువగా డిజైన్, ఇంజినీరింగ్, ప్రొడక్షన్ విభాగాల నుంచి ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం.
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో మెరుగైన వ్యయ నిర్వహణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఉద్యోగుల తొలగింపులను సమర్థించుకున్న వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ , కంపెనీ లాభదాయకంగా మారడానికి ఇది కీలకమైన దశ అని అన్నారు. అయితే ఇకపై బైజూస్ లో లేఆఫ్స్ ఉండవని వ్యవస్థాపకుడు, సీఈఓ బైజు రవీంద్రన్ హామీ ఇచ్చిన 3 నెలలు ముగియగానే మరో 1000 మందిని తొలగించడం గమనార్హం. మరి తాజా నివేదికలపై కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment