
లక్నో : ‘లవ్ జిహాద్’ పేరుతో 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి, బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించిన వ్యక్తిపై కేసు నమోదైంది. వివరాల ప్రకారం..యూపీ మీరట్‌కు చెందిన 25 ఏళ్ల అమన్ అనే యువకుడు తన వద్ద ట్యూషన్‌కు వచ్చిన యువతితో స్నేహం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని కోరగా, అందుకు అమ్మాయి అంగీకరించలేదు. దీంతో ఆమె తమ్ముడిని హత్య చేస్తానంటూ అమన్ బెదిరించినట్లు యువతి ఫిర్యాదులో తెలిపింది. (పెళ్లి చేసుకోవాలని మహిళ వేధింపులు.. జవాను ఆత్మహత్య)
యువతిని ఢిల్లీకి తీసుకెళ్లిన అమన్..ఆమెను ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నించాడు. ట్యూషన్‌కు వెళ్లిన యువతి ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కంగారు పడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్యూషన్ టీచర్ అమన్ తమ కూతురిని కిడ్నాప్ చేసినట్లు వారు ఫిర్యాదులో తెలిపారు. మొబైల్ ట్రేసింగ్ ద్వారా యువతి ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..అమన్‌ను అరెస్ట్ చేసి, యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నించినట్లు యువతి పేర్కొనడంతో అమన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. (ప్రాణం తీసిన ప్రేమ )
Comments
Please login to add a commentAdd a comment