చిన్నారిని కిడ్నాప్‌ చేయించిన మేనమామ | 7 Years Old Girl Kidnap Mystery In Karnataka | Sakshi
Sakshi News home page

చిన్నారిని కిడ్నాప్‌ చేయించిన మేనమామ

Published Fri, Oct 29 2021 6:42 AM | Last Updated on Fri, Oct 29 2021 11:29 AM

7 Years Old Girl Kidnap Mystery In Karnataka - Sakshi

సాక్షి, రాయచూరు (కర్ణాటక): డబ్బు కోసం ఏడేళ్ల వయసున్న మేనకోడలిని కిడ్నాప్‌ చేయించిన మామ కటకటాల పాలయ్యాడు. వివరాలు..బాగల్‌కోటె నవనగరలో సునీత అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమెకు ఓం అనే కుమారుడు, కృతికా బాడగండి(7) అనే కుమార్తె ఉంది. అన్నతో కలిసి బుధవారం రాత్రి ట్యూషన్‌ నుంచి ఇంటికి కాలినడకన వస్తుండగా కారులో వచ్చిన మేనమామ గద్దెనగిరి, మరో ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు.

బాలికను కారులోకి ఎక్కిస్తుండగా తన చెల్లిని వదిలేయాలని అన్న ఓం దుండగుల కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు. దుండగులు బాలుడిని తోసేసి బాలికను వెంట తీసుకెళ్లి రూ.50 లక్షలు ఇవ్వాలని బాధితురాలి తల్లి సునీతకు ఫోన్‌ చేశారు. ఆమె నవనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలిస్తున్నట్లు తెలియడంతో దుండగులు ఆ బాలికను ఇంటి వద్ద వదిలేసి ఉడాయించారు. పోలీసులు బాలిక మేనమామను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా జూదం కోసం అవసరమైన డబ్బు కోసం కిడ్నాప్‌ చేయించినట్లు అంగీకరించడంతో అరెస్ట్‌ చేశారు.  

చదవండి: నటుడి పేరుతో ఫేస్‌బుక్‌లో నగదు మోసం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement