
మైసూరు: రాచనగరి మైసూరులో ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. గిఫ్ట్ ఆశకు గురయి ఒక యువతి రూ. 6.05 లక్షలను పోగొట్టుకుంది. సరస్వతిపురం నివాసి అపూర్వ లక్ష్మణ్ అనే యువతికి డెర్మా కో అనే కంపెనీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీరు లక్కీ డ్రాలో విజేతగా నిలిచారని, రూ. 5 వేలు షాపింగ్ చేస్తే భారీ కానుక వస్తుందని నమ్మబలికారు.
ఇలా పలు దఫాలుగా ఆ యువతికి ఫోన్ చేసి మొత్తంగా రూ. 6,05,618ను డబ్బులను సైబర్ మోసగాళ్లు కాజేశారు. ఆ తర్వాత గిఫ్ట్ రాక, ఇచ్చిన డబ్బులు వెనక్కి రాక మోసపోయానని గ్రహించిన యువతి నగరంలోని సైబర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment