విద్యార్థిని చితకబాదిన టీచర్‌.. కేసు నమోదు | Teacher Beaten Tenth Class Student In Uppal hyderabad | Sakshi
Sakshi News home page

విద్యార్థిని చితకబాదిన టీచర్‌.. కేసు నమోదు

Published Sun, Aug 26 2018 8:39 AM | Last Updated on Thu, Sep 27 2018 5:29 PM

Teacher Beaten Tenth Class Student In Uppal hyderabad - Sakshi

చిలుకానగర్‌ కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌

ఉప్పల్‌: చిలుకానగర్‌లోని ఓ ప్రైౖవేటు స్కూల్‌లో  పదవ తరగతి విద్యార్థిని చితక బాదిన ఉపాద్యాయుడిపై  ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో  శనివారం కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. చిలుకానగర్‌లోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో పద్యం అప్పజెప్పలేదని పదవతరగతి విద్యార్థినిని తెలుగు ఉపాధ్యాయుడు యశ్వంత్‌ చితక బాదాడు. బాలికపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరచడంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో  బాలిక తండ్రి వేంకటేశ్వర్లు ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు. ఈ విషయంపై విద్యార్థిని కుటుంబసభ్యులు స్కూల్‌ యాజమాన్యాన్ని అడగడానికి వెళ్లగా సమాచారం తెలుసుకున్న తెలుగు మాస్టార్‌  కుటుంబ సభ్యులు వచ్చి వెంకటేశ్వర్లుపై స్కూల్లోనే దాడి చేసి చితక బాదారు. దీంతో స్కూల్లో కాసేపు భయానక వాతావరణం నెల కొంది. విద్యార్థినిపై దాడిచేసిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement