సాక్షి, హైదరాబాద్: జుట్టు రాలిపోతుందనే బెంగతో ఓ యువకుడు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. గదిలో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 25న మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. నితిన్ అనే యువకుడు స్నేహితులతో కలిసి సత్యనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. క్యాటరింగ్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. నితిన్ తన ఆదాయంలోనే కొంత తల్లిదండ్రులకు కూడా పంపి. మరికొంత డబ్బు దాచుకునేవాడు. డబ్బు దాచుకోవడానికి కారణం ఉంది. ఇటీవల నితిన్ కు జుట్టు రాలిపోతుండడంతో తీవ్ర ఆందోళనకు గుర య్యేవాడు.
ఓవైపు పెళ్లి కూడా కాలేదు. దాంతో పెళ్లికి ముందే జుట్టంతా ఊడిపోతే ఎలా అని భావించి, హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం డబ్బు పొదుపు చేయడం మొదలుపెట్టాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో డబ్బు సంపాదన నిలిచిపోవడం. దానికితోడు సోదరి పెళ్లికి డబ్బు పంపాలని ఇంటి నుంచి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో, తీవ్ర మనస్తాపం చెందిన నితిన్, ఈనెల 25న స్నేహితులు గదిలో లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, పెళ్లి కాకముందే జుట్టంతా రాలిపోతోందన్న ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment