సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉందని..
ఫోన్‌లో రీల్స్ చూస్తోందని భార్యను చంపేశాడు
వివాహిత హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
ఉప్పల్: ఫోన్‌లో నిత్యం రీల్స్ చూస్తోందని.. ఇన్‌స్టాలో, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉందని భార్యపై కక్షగట్టిన ఓ భర్త.. ఆమెను చంపేసి పరారైన కేసును ఉప్పల్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. శనివారం ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ చక్రపాణి వివరాలను వెల్లడించారు. ఈ నెల 12న ఉప్పల్ న్యూభరత్‌నగర్‌లోని ఓ ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి చూడగా ఓ గోనే సంచిలో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహం కనిపించింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రదీప్ బోలా, మధుస్మిత (28) దంపతులు ఆరు నెలలుగా ఉప్పల్ న్యూ భరత్‌నగర్‌లో ఉంటున్నారు. వీరికి కేన్సర్‌తో బాధపడుతున్న 8 నెలల కూతురు ఉంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగు తున్నాయి. ఇంటికి వచ్చిన భర్త ప్రదీప్‌ను మధుస్మిత పట్టించుకోకపోవడం, పలకరించకపోవడం.. ఎప్పుడు చూసినా ఫోన్‌లో రీల్స్ చూస్తూ ఉండేది. మధుస్మిత నిత్యం వేరే వాళ్లతో ఫోన్ మాట్లాడేదని, దీంతో ఆమెపై అనుమానంతో ఈ నెల 7న రొట్టెల పీటతో కొట్టి చంపేశాడు. 8 నెలల కూతురును వెంట తీసుకుని సికింద్రాబాద్‌కు రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు.
తన కూతురును కాస్త చూస్తూ ఉండండని పక్కవాళ్లకు చెప్పి ప్రదీప్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడు బేగంపేట్‌లోని ఓ హోటల్ పని చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో శనివారం ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ఆధ్వర్యంలో నిందితుడు ప్రదీప్ బోలాను పట్టుకున్నారు. భార్య తనను పట్టించుకోకపోయేదని, రోజంతా ఫోన్‌లో రీల్స్ చూస్తుండట.. రీల్స్ చేస్తుండటం.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంతో అనుమానం పెంచుకుని భార్యను చంపినట్లు విచారణంలో తేలిందని పోలీసులు చెప్పారు. కేసు మిస్టరీని ఛేదించిన సీఐ ఎలక్షన్ రెడ్డి, స్పెషల్ టీమ్ బృందాన్ని ఏసీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment