Hyderabad: కట్టుకున్నోడే కడతేర్చాడు.. | Wife Murdered By Husband Over Suspicion Of Infidelity At Uppal Hyderabad, More Details Inside | Sakshi
Sakshi News home page

Hyderabad: కట్టుకున్నోడే కడతేర్చాడు..

May 22 2024 7:39 AM | Updated on May 22 2024 10:48 AM

అనుమానంతో ప్రశ్నించిన భార్య చంపిన భర్త 

ఉప్పల్‌లో ఘటన

హైదరాబాద్: ఉప్పల్‌ ఎస్‌బీఐ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భర్తపై ఉన్న అనుమానంతో ప్రశి్నంచినందుకు అర్దరాత్రి భార్య గొంతుపై కాలు పెట్టి తొక్కి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడో కిరాతకుడు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగాం లింగంపల్లి ప్రాంతానికి చెందిన భూక్యా రమేశ్‌, కొండాపూర్‌ దుబ్బ తండాకు చెందిన భూక్యా కమలకు 2016లో వివాహం జరిగింది. బతుకు దెరువుకోసం నగరానికి వచ్చి ఉప్పల్‌ ఎస్‌బీఐ కాలనీలో ఉంటున్నారు.

వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు నానమ్మ ఇంటికి వెళ్లారు. కాగా గత కొంత కాలంగా భర్త రమేష్‌ వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కమల అనుమానించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు నిలదీసి పంచాయితీ పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం భార్యా భర్తల మధ్య గొడవ మొదలయింది. అనంతరం ఇద్దరు కలిసి ఇంటికి తాళం పెట్టి బయటకు వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చారు. రాత్రి వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగి..రమేశ్‌ భార్య తలపై కొట్టడంతో కింద పడిపోయింది. 

వెంటనే ఆమె గొంతు మీద కాలు పెట్టి తొక్కి..చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కమల హత్య వార్త తెలుసుకున్న కుంటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ఉదయం ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement