wife murder husband
-
Hyderabad: కట్టుకున్నోడే కడతేర్చాడు..
హైదరాబాద్: ఉప్పల్ ఎస్బీఐ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భర్తపై ఉన్న అనుమానంతో ప్రశి్నంచినందుకు అర్దరాత్రి భార్య గొంతుపై కాలు పెట్టి తొక్కి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడో కిరాతకుడు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగాం లింగంపల్లి ప్రాంతానికి చెందిన భూక్యా రమేశ్, కొండాపూర్ దుబ్బ తండాకు చెందిన భూక్యా కమలకు 2016లో వివాహం జరిగింది. బతుకు దెరువుకోసం నగరానికి వచ్చి ఉప్పల్ ఎస్బీఐ కాలనీలో ఉంటున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు నానమ్మ ఇంటికి వెళ్లారు. కాగా గత కొంత కాలంగా భర్త రమేష్ వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కమల అనుమానించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు నిలదీసి పంచాయితీ పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం భార్యా భర్తల మధ్య గొడవ మొదలయింది. అనంతరం ఇద్దరు కలిసి ఇంటికి తాళం పెట్టి బయటకు వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చారు. రాత్రి వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగి..రమేశ్ భార్య తలపై కొట్టడంతో కింద పడిపోయింది. వెంటనే ఆమె గొంతు మీద కాలు పెట్టి తొక్కి..చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కమల హత్య వార్త తెలుసుకున్న కుంటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ఉదయం ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
-
భర్తను వధించి.. వంటగది కట్టి..
అనుప్పుర్ (మధ్యప్రదేశ్): కట్టుకున్న భర్తను చంపి ఆయన శవాన్ని ఇంట్లోనే పూడ్చి, దానిపై వంటగది ఏర్పాటు చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని అనుప్పుర్‌లో జరిగింది. అనుప్పుర్ దగ్గర్లోని కోట్మాకు చెందిన ప్రతిమ బనవాల్ (32) తన భర్త, లాయర్ మోహిత్‌ను అక్టోబర్ 22న వైరుతో గొంతు బిగించి చంపింది. అనంతరం ఆధారాలు దాచేందుకు ఆయన మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చి, ఆ ప్రదేశంలో వంటగది ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మోహిత్ తమ్ముడు అర్జున్ తన అన్న గురించి ప్రతిమను వాకబు చేయగా పొంతన లేని సమాధానాలిచ్చింది. దీంతో అనుమానం వచ్చిన అర్జున్ ఇరుగుపొరుగువారితో కలసి ఆమె లేని సమయంలో తలుపులు బద్దలు కొట్టి వంటగదిగా ఉపయోగిస్తున్న ప్రాంతంలో దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని తవ్వి మోహిత్ మృతదేహాన్ని వెలికితీశారు. ప్రతిమను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భర్త గొంతు నులిమి హత్య చేసిన భార్య
బెంగళూరు : ఆస్తి కోసం ఓ బ్యాంకు ఉద్యోగిని అతని భార్య, కుమార్తె, అల్లుడు హతమార్చిన సంఘటన రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం హోస్సళ నగరంలో నివాసం ఉంటున్న అంకయ్య (57) యూనియన్ బ్యాంకులో డీ గ్రేడ్ ఉద్యోగి. ఆయనకు భార్య నాగరత్న, కుమారుడు సురేష్ బాబు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో వారు వేరుగా కాపురం ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో బీఎంటీసీ డ్రైవర్ ఆనంద్ తో నాగరత్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించసాగింది. విషయం తెలుసుకున్న సురేష్ తల్లిని ఎదిరించాడు. దీంతో అతన్ని, అతని భార్యను ఇంటిలో నుంచి గెంటేయించింది నాగరత్న. సురేష్ మీద ప్రేమ ఎక్కువగా ఉన్న అంకయ్య తన ఆస్తిని అతని పేరుమీదే రాయాడానికి నిశ్చయించుకున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన నాగరత్న.. తన కుమార్తె ఝాన్సీరాణి, అల్లుడు పాండియన్‌ను తీసుకొచ్చి తన ఇంట్లో ఉంచుకుంది. అంకయ్యను హత్య చేయడానికి వీరంతా పథకం రచించారు. అందుకు పాండియన్ తన స్నేహితులు రాజేంద్రకుమార్, సిరాజ్ సాయం తీసుకున్నారు. వీరంతా కలిసి గత నెల 28న రాత్రి భోజనంలో నిద్ర మాత్రలు కలిపి అంకయ్యకు పెట్టారు. దీంతో ఆయన మత్తులో ఉండగా గొంతు నులిమి హత్య చేశారు. గుండెనొప్పితో అతను మరణించాడని అందరినీ నమ్మించి... శాంతినగరలో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మరణంపై అనుమానం వచ్చిన సురేష్ వారం క్రితం పోలీసుల్ని ఆశ్రయించాడు. దీంతో వారు అంకయ్య మృతదేహాన్ని వెలికి తీయించి... పోస్ట్ మార్టం నిర్వహించడంతో అది హత్యేనన్న విషయం వెలుగు చూసింది. నాగరత్న, నిందితులను రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న రాజేంద్రకుమార్, సిరాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.