Teacher Arrested For Misbehaving With Students At Nizamabad - Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌: విద్యార్థినిలతో అసభ్యకర ప్రవర్తన.. కీచక టీచర్‌కు దేహశుద్ధి

Published Fri, Dec 2 2022 7:29 PM | Last Updated on Fri, Dec 2 2022 9:06 PM

Teacher Arrested For Misbehaving With Students At Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు టీచర్లు తమ స్థానం మరిచిపోయి విద్యార్థినిలను వేధింపులకు గురిచేస్తున్నారు. పాఠాలు నేర్పించే క్రమంలో కామకాంక్షను వారిపై ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో కటకటాల్లోకి వెళ్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. మాడ్రన్‌ఎయిడెడ్‌ పాఠశాలలో రమణ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, పాఠాలు చెప్పే క్రమంలో రమణ.. విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో, ఆవేదనకు గురైన విద్యార్థినిలు ఈ విషయాన్ని ఇంటి వెళ్లి తమ పేరెంట్స్‌కు చెప్పారు. ఈ క్రమంలో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు రమణకు దేహశుద్ధి చేశారు. 

టీచర్‌ రమణకు విద్యార్థులు, టీచర్స్ చితకబాదారు. ఈ ఘటనపై విద్యార్థులు పేరెంట్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమణకు పోలీసులు తీసుకువెళ్తున్న క్రమంలో కూడా రమణను విద్యార్థులు పేరెంట్స్‌ తీవ్రంగా కొట్టారు. అనంతరం, చిరిగిన చొక్కాతోనే రమణను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement