![Six more people arrested in digital arrest case](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/29/police.jpg.webp?itok=lgONQVDO)
సీబీఐ అధికారుల ముసుగులో అమాయకులను దోచుకుంటున్న ముఠా
22న ఒకరి అరెస్టు, రూ.24.50 లక్షల నగదు స్వాధీనం
తాజాగా రూ.32.5 లక్షల నగదు, 141 గ్రాముల బంగారం సీజ్
తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు
తిరుపతి క్రైం: డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను మోసగిస్తున్న కేసులో మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 65 ఏళ్ల వృద్ధురాలికి ఇటీవల వాట్సాప్ ద్వారా ఒక వీడియో కాల్ వచ్చింది.
‘‘నేను ఢిల్లీ నుంచి సీబీఐ అధికారిని మాట్లాడుతున్నాను. రూ.200 కోట్ల మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించిన వివరాల కోసం సంప్రదించాను’’ అని నమ్మించాడు. వృద్ధురాలి పేరిట ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి చట్ట వ్యతిరేక లావాదేవీలు జరుగుతున్నాయని, అందువల్ల డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని భయభ్రాంతులకు గురి చేశారు. వివిధ అకౌంట్లలోకి నగదు ట్రాన్స్‌ఫర్ చేస్తే వాటిని పరిశీలించి, మనీ ల్యాండరింగ్ కేసుతో సంబంధం లేకపోతే తరువాత డబ్బులు రిలీజ్ చేస్తామని నమ్మించారు.
వృద్ధురాలు తన ఖాతాలో ఉన్న రూ.2.50 కోట్లు వారు చెప్పిన వివిధ అకౌంట్లలో జమచేసింది. అనంతరం వారు స్పందించకపోవడంతో ఈ నెల 13న వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 22న అప్పటి ఇన్‌చార్జ్ ఎస్పీ మణికంఠ రాజమండ్రి కి చెందిన పాలకొల్లు అరుణ్ వినయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.
అతని వద్ద నుంచి రూ. 24.5 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఓ కారు, రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, 16 గ్రాముల బంగారం కూడా స్వా«దీనం చేసుకున్నట్లు వివరించారు. అదే కేసులో తాజాగా మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.32.5 లక్షల నగదు, 141 గ్రాముల బంగారం, 8 సెల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్, సిమ్ మాడ్యూల్‌ను సీజ్ చేశామని, మరో రూ. 10 లక్షలు ఫ్రీజ్ చేశామని చెప్పారు.
నిందితుల వివరాలు
1. సింగంపల్లి గణేష్(34), త్రినాధపురం, విశాఖపట్నం.
2. పాలకొల్లు రవికుమార్(28), చిన్న వాల్తేరు, విశాఖపట్నం .
3. యుల్లి జగదీష్(37), సత్యనగర్, ఇండ్రస్టియల్ ఎస్టేట్, కంచరపాలెం, విశాఖపట్నం.
4. పెంకి ఆనంద్ సంతోష్ కుమార్ అలియాస్ సంతోష్ (39), రామ్‌నగర్, శ్రీ హరిపురం, విశాఖపట్నం
5. ఊటా అమర్ ఆనంద్ (33), సుజాతా నగర్, గొల్లవెల్లివాని పాళెం, ఎల్‌ఐసి కాలనీ, పెందుర్తి మండలం, విశాఖపట్నం రూరల్
6. వాసుదేవ్(34), మురళీనగర్, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment