diputy cm
-
నెట్స్‌లో చెమటోడ్చిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్
పట్నా: రాజకీయ నేతలంటే ఎంతో బిజీగా ఉంటారు. అలాంటిది ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఓ పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తున్న నాయకుడైతే అసలు తీరికే ఉండదు. కానీ, బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. రాజకీయాలే కాదు ఇతర అంశాల్లోనూ తగ్గేదేలే అంటున్నారు. ఆదివారం ఉదయం యువకులతో కలిసి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ క్రికెటర్లా బ్యాటింగ్ చేస్తున్న తేజస్వీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తేజస్వీ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బ్యాటింగ్ ప్యాడ్స్, గ్లౌజులు, క్యాప్ ధరించి ప్రాక్టీస్ చేస్తున్నారు తేజస్వీ యాదవ్. ‘బిహార్‌కు చెందిన యువ ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేస్తున్నా. మీ అభిరుచిని ప్రేమించండి.. మీ లక్ష్యం కోసం జీవించండి’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు తేజస్వీ యాదవ్. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.6 లక్షల మందికిపైగా వీక్షించారు. తేజస్వీ యాదవ్‌ని తిరిగి నెట్స్‌లో చూడటంపై సంతోషం వ్యక్తం చేశారు పలువురు అభిమానులు. ఇలాంటి వాటిల్లో తేజస్వీ కనిపించటం ఇదే తొలిసారి కాదు. కొద్ది రోజుల క్రితం పట్నాలోని తన నివాసంలో క్రికెట్ ఆడుతున్న వీడియోను ట్వీట్ చేశారు తేజస్వీ. Practising with young & bright players of Bihar. #Cricket Love your passion Live your purpose pic.twitter.com/Q5S6j2YmGG — Tejashwi Yadav (@yadavtejashwi) January 8, 2023 ఇదీ చదవండి: ప్రపంచంలోనే తొలి రోబో లాయర్..ఏకంగా ఓ కేసునే టేకప్ చేస్తోంది -
పదవి ఏదైనా అధికారం నాదే!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు, డిప్యూటీ సీఎం పదవి చేపట్టటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్. పదవి అనేది రాజకీయ సామర్థ్యాన్ని నిర్ధారించదని పేర్కొన్నారు. శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పినప్పుటికీ అధికారం ఫడ్నవీస్ చేతిలోనే ఉందనే వాదనలు వినిపిస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేయటం మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. మరోవైపు.. ఆయన చేతిలోనే ఆరు పోర్ట్‌ఫోలియోలు ఉండటమూ గమనార్హం. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టకపోవటంపై మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వంలో పలు పోర్ట్‌ఫోలియోలు నిర్వహించటంపై ప్రశ్నించగా.. గతంలో ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతలు నిర్వర్తించినట్లు గుర్తు చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. ‘మంత్రివర్గ విస్తరణ పెండింగ్‌లో ఉన్నందున ఆ శాఖలు నా అధీనంలోనే ఉన్నాయి. విస్తరణ తర్వాత అందులో కొన్ని ఇతరుల చేతికి వెళ్తాయి. తమ ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలు ఎవరికైనా ఇవ్వొచ్చు. వారిని ఆ బాధ్యతల్లో విజయవంతం చేయటమే మా బాధ్యతగా విశ్వసిస్తాం. పోర్ట్‌ఫోలియో ఏదనేది పట్టింపులు లేవు.. సుపరిపాలన అందించటమనేదానిపైనే సమష్టి కృషి ఉంటుంది. రాజకీయంలో పోస్టును బట్టి శక్తిసామర్థ్యాలు నిర్ణయం కావు, నీవు ఎవరనేదే ముఖ్యం. నేను రాజకీయంగా బలపడ్డానా లేదా నష్టపోయానా? అనే అంశాన్ని మహారాష్ట్రలోని ఎవరినైనా అడగవచ్చు.’ అని పేర్కొన్నారు దేవేంద్ర ఫడ్నవీస్. థాక్రే వెన్నుపోటుకు ప్రతీకారం.. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయి.. బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపైనా స్పందించారు దేవేంద్ర ఫడ్నవీస్. శివసేన నేత ఉద్ధవ్ థాక్రే బీజేపీకి వెన్నుపోటు పొడిచారని, అందుకే కాషాయ పార్టీ ప్రతీకారం తీర్చుకోవాలనుకుందని అసలు విషయం వెల్లడించారు. ముందుగా ప్రభుత్వంలో ప్రాతినిథ్యం వహించకూడదని నిర్ణయించుకున్నానని, అయితే, వెలుపల ఉండి ప్రభుత్వాన్ని నడిపించలేమని, నా అనుభవం అవసరమని పార్టీ నేతలు ఒప్పించినట్లు చెప్పారు. వారి కోరిక మేరకే ప్రభుత్వంలో భాగమయ్యాయని వెల్లడించారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉండాలని బీజేపీ సూచించినప్పుడు షాక్‌కి గురయ్యానని, అయితే, తనను ఎప్పుడూ డిప్యూటీ అనే ఆలోచన రాకుండా షిండే చూసుకుంటున్నారని ప్రశంసించారు. ఇదీ చదవండి: ఢిల్లీలో డీజిల్ కార్లపై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.20వేల జరిమానా -
మహాభారత కాలంలోనే జర్నలిజం..
సాక్షి, మధుర : జర్నలిజంపై యూపీ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాభారతం సమయంలోనే పాత్రికేయ వృత్తి ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. హిందీ జర్నలిజం డే సందర్భంగా గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.హిందూ పురాణాల్లో దేవతలకు వార్తలను చేరవేసే నారదుడిని ఆయన ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌తో పోల్చారు. మీ గూగుల్ ఇప్పుడు ప్రారంభమైతే తమ గూగుల్ శతాబ్ధాల కిందటే వెలుగుచూసిందని, సమాచార సారధైన నారదముని సందేశాలను ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి వాయువేగంతో చేరవేసేవారని అన్నారు. ఇక హస్తినాపురంలో కూర్చుని సంజయుడు మహాభారత యుద్ధాన్ని దృతరాష్ర్టుడికి వివరిస్తాడని ఇది ప్రత్యక్ష ప్రసారం కాక మరేమిటని దినేష్ శర్మ ప్రశ్నించారు. సంజయుడి కళ్ల ద్వారా మహాభారత ఘట్టాలను ఇతరులు ఎలా వీక్షించారని ప్రశ్నించగా అలాంటి సాంకేతికత అప్పట్లోనే అందుబాటులో ఉందని వ్యాఖ్యానించారు. అంధుడైన ధృతరాష్ట్రుడు ఇంట్లో కూర్చుని యుద్ధ విశేషాలను తెలుసుకుంటాడని, ఇది సనాతన భారత్ సాధించిన విజయంగా త్రిపుర గరవ్నర్ తథాగథ రాయ్ గతంలో పేర్కొన్నారు. కాగా, మహాభారత కాలంలోనే ఇంటర్నెట్, శాటిలైట్ వ్యవస్థ ఉందని అస్సాం సీఎం విప్లవ్ దేవ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
ప్రపంచ స్థాయి ప్రమాణాల కోసమే....
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి ప్రమాణాలున్నవిద్యావకాశాల కోసమే ప్రైవేట్ యూనివర్సిటీలకు అవకాశమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనతో తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ‘ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపన, నియంత్రణ బిల్లు’ను శాసన మండలి ఆమోదించింది. ఈ సందర్భంగా శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ యువతకు విద్యావకాశాలు విస్తృతం చేయడం కోసమే ప్రైవేట్ యూనివర్సీటీలకు అనుమతి ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనం కోసమే 25 శాతం తెలంగాణ వాసులకు దక్కేలా నిబంధన విధించామని చెప్పారు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయని గుర్తుచేశారు. యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలకు లోబడి ఆ యూనివర్సిటీలు పనిచేయాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని స్సష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే అత్యధిక ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. జాతీయస్థాయిలో ఒకలా...ఇక్కడ మరో విధంగా భాజపా విధానం ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అవసరానికి మించిన కాలేజీలు ఉన్నాయని, వాటిని నియంత్రిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే 1016 పోస్టులకు ఇప్పటికే అనుమతి ఇచ్చామన్నారు. -
'నా మీద నమ్మకంతోనే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు'
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తన మీద నమ్మకంతోనే డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారని కొత్తగా డిప్యూటీ సీఎంగా ఎన్నికైన కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం వరంగల్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. వరంగల్ కు ఆయన వరాల జల్లు కురిపించారు. వరంగల్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి పారిశ్రామిక పట్టణంగా తీర్చి దిద్దుతానని తెలిపారు. ప్రజల భిక్షతోనే తనకీ పదవి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు రాజకీయాలు చేయాలని, ఎన్నికల అనంతరం ప్రజలకు సేవ చేయాలని ఆయన రాజకీయ పార్టీలకు హితవు పలికారు.