భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న తెలంగాణ ప్రాంత ఆటగాళ్లు అవనీశ్ రావు, అభిషేక్ మురుగన్ తెలుగులో మాట్లాడుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో వికెట్‌కీపర్ అవనీశ్ రావు, స్పిన్ బౌలర్ అభిషేక్ మురుగన్‌తో హైదరాబాద్ యాసలో సంభాషించాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. విదేశీ గడ్డపై వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్ ఫైనల్లో ఇద్దరు తెలుగు వాళ్లు మాట్లాడుకుంటుంటే వినసొంపుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇద్దరు క్రికెటర్లు గ్రౌండ్ లో తెలుగులో మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది కదూ.!! 🤩
— StarSportsTelugu (@StarSportsTel) February 11, 2024
మరి ఈరోజు U19 ఫైనల్స్ లో అదే జరిగింది 😃
మరి మీరు కూడా చూసేయండి.!!
చూడండి
ICC U19 World Cup Final#INDU19vAUSU19 లైవ్
మీ #StarSportsTelugu & Disney + Hotstar లో#U19WorldCupOnStar pic.twitter.com/UPX0xz7zCd
ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. ఆసీస్ నిర్ధేశించిన 254 పరుగుల లక్ష్య ఛేదనలో యువ భారత్ చేతులెత్తేసింది. 36 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 136/8గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే ఇంకా 118 పరుగులు చేయాలి చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఏదైన మహాద్బుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా గట్టెక్కలేదు.
మురుగన్ అభిషేక్ (23), నమన్ తివారి (2) క్రీజ్‌లో ఉన్నారు. భారత స్టార్ త్రయం ముషీర్ ఖాన్ (22), ఉదయ్ సహారన్ (8), సచిన్ దాస్ (9) డు ఆర్ డై మ్యాచ్‌లో చేతులెత్తేశారు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (47) కొద్దో గొప్పో ఆడేందుకు ప్రయత్నించాడు. ఆర్శిన్ కులకర్ణి 3, ప్రియాన్షు మోలియా 9, అవనీశ్ 0, రాజ్ లింబాని 0 పరుగులకు ఔటయ్యారు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment