పట్నా: రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాతే తన పెళ్లి గురించి ఆలోచిస్తానని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. ప్రస్తుతానికి తన దృష్టి అంతా 2019 లోక్‌సభ ఎన్నికలపైనే ఉందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహం, తన వివాహం, ఇతర అంశాలను ఆయన విలేకరులతో పంచుకున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డిసెంబర్‌లో పట్నాలో భారీ ర్యాలీ చేపడతామని తేజ్ పేర్కొన్నారు. ఈ ర్యాలీలో ఇతర ప్రతిపక్ష పార్టీలను సైతం ఆహ్వానిస్తామన్నారు.
అక్టోబర్ 6 నుంచి రెండో విడత సంవిధాన్ బచావో న్యాయ యాత్ర ప్రారంభిస్తానని తేజస్వీ తెలిపారు. ఇతర పార్టీలను కలుపుకొని ఎన్నికలకు వెళ్తానన్నారు. కూటమిలో సీట్ల పంపకం ఎలా చేస్తారని ప్రశ్నించగా గెలిచే చోట తమ పార్టీ సీట్లను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
లాలూ కుటుంబ సభ్యులు తేజస్వీకి పెళ్లి చేయాలనుకుంటున్న నేపధ్యంలో పలు సంబంధాలు వస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకుంటే ఎన్నికల కారణంగా హనీమూన్‌కు ఆటంకం ఏర్పడుతుందని అందుకే ఎన్నికల తర్వాత తేజ్ వివాహం చేసుకోవాలనుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment