
న్యూఢిల్లీ: తాను రైల్వేమంత్రిగా ఉన్న కాలంలో భూములు రాయించుకుని కొందరికి రైల్వేలో గ్రూప్–డీ ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈడీ సమన్లు జారీచేసింది. ఆయన కుమారుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కూ సమన్లు పంపింది.
ఈనెల 22వ తేదీన ఢిల్లీ ఆఫీస్‌కు రావాలని తేజస్వీని, డిసెంబర్ 27న రావాలని లాలూకు ఈడీ సూచించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో వీరిద్దరి నుంచి అధికారులు వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఈడీ ఇప్పటికే ఇదే కేసులో ఏప్రిల్‌లో ఎనిమిది గంటలపాటు తేజస్వీని విచారించింది. లాలూ ప్రసాద్‌కు ఈ కేసులో సమన్లు పంపడం ఇదే తొలిసారి. గత నెలలో లాలూ కుటుంబానికి ఆప్తుడైన అమిత్ కాత్యాల్‌ను ఈడీ అరెస్ట్‌చేసిన నేపథ్యంలో వీరికి సమన్లు జారీకావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment