పట్నా: ఆర్జేడీ నేత, బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ జేడీయూపై వ్యంగ్యాస్త్రాలు సందించారు. బీజేపీకి జేడీయూ అడ్వాన్స్ వర్షన్ పార్టీ అని వర్ణించారు. జేడీయూలో ఎవరు కొత్త వారు చేరాలన్నా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నిర్ణయిస్తారని ట్వీట్ చేశారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా అమిత్ షా ఆహ్వానం మేరకే జేడీయూలో చేరారని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
అమిత్ షా సూచన మేరకే ప్రశాంత్ కిషోర్‌ని జేడీయూ ఉపాధ్యాక్షుడి నితీష్ కుమార్ నియమించారని తెలిపారు. ప్రభుత్వంలో ఎవరిని నియమించాలో కూడా అమిత్ షానే నిర్ణయిస్తారని తేజస్వీ అభిప్రాయపడ్డారు. బిహార్ ఇంకా ఎందుకు వెనకబడి ఉందో రాష్ట్ర సీఎం నితీష్ ఇప్పుడునా అర్థ చేసుకుంటారని ఆయన ఆకాక్షించారు.
ఎన్నికల వ్వూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ గత ఏడాది అక్టోబర్‌లో జేడీయూలో చేరిన విషయం తెలిసిందే. తన సొంత రాష్ట్రమైన బిహార్ ప్రజలకు సేవచేసేందుకు మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు. కానీ వచ్చే పదేళ్ల వరకు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేసేది లేదని ఆయన ఇదివరకే తేల్చిచెప్పిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment