తండ్రి మాటలకు డిప్యూటీ సీఎం వత్తాసు! | Tejaswi Yadav backs Lalu prasad support to Nitish as PM | Sakshi
Sakshi News home page

తండ్రి మాటలకు డిప్యూటీ సీఎం వత్తాసు!

Apr 20 2016 7:00 PM | Updated on Sep 3 2017 10:21 PM

తండ్రి మాటలకు డిప్యూటీ సీఎం వత్తాసు!

తండ్రి మాటలకు డిప్యూటీ సీఎం వత్తాసు!

బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తన తండ్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ వ్యాఖ్యలకు వత్తాసు పలికారు.

పట్నా: బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తన తండ్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ వ్యాఖ్యలకు వత్తాసు పలికారు. ఇంతకీ విషయం ఏంటంటే... ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ లలో ఎవరు బెస్ట్ అని మీడియా లాలును ప్రశ్నించింది. ఏమాత్రం తడుముకోకుండా నితీశ్ ఇందుకు సమర్ధుడు అంటూ లాలు బదులిచ్చారు. ఇదే విషయంపై లాలు కుమారుడు  డిప్యూటీ సీఎం తేజస్వి  స్పందించారు. తన తండ్రి చెప్పిన దాంట్లో తప్పేంలేదని మరిన్ని వివరాలు పేర్కొన్నారు.

ప్రధానిగా రాహుల్, నితీశ్ లలో ఎవరు కరెక్ట్ అన్న విషయంపై నితీశ్ పేరును తండ్రి లాలు చెప్పడాన్ని తేజస్వి సమర్ధించారు. బిహార్ సీఎంకు క్లీన్ ఇమేజ్ ఉందని, ఐదు పర్యాయలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని ఈ అనుభవం సరిపోతుందని వివరించారు. మీడియా ప్రశ్నకు సమాధానం దేశ ప్రజానికానికి కూడా తెలుసునని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రధాని అభ్యర్థిత్వంపై చర్చిస్తామని, ప్రస్తుతం ఈ విషయాన్ని పెద్దది చేసి చూడవద్దని ఇంతటితో వదిలేయాలని సూచించారు. మంగళవారం లాలు ప్రసాద్ తన మద్ధతు నితీష్ కు ఉంటుందని మీడియాతో ముచ్చటించిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement